
ఎన్నికల హామీ మేరకే చిలుక వాగు ప్రక్షాళన
తాండూరు: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి కృషి వల్లే చిలుక వాగు ప్రక్షాళన పనులు వేగంగా జరుగుతున్నాయని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హబీబ్‌లాల పేర్కొన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ పరిఽధిలోని 9 వార్డు సాయిపూర్ ప్రాంతంలో రూ.16 కోట్లతో చేపట్టిన చిలుక వాగు అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా చిలుక వాగు కబ్జాకు గురైందన్నారు. గతంలో ఎంతో మంది నేతలు చిలుక వాగు అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నది తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అని పేర్కొన్నారు. వచ్చే వర్షాకాలంలో సాయిపూర్, గ్రీన్ సిటీ ప్రాంతాలు నీటి ముంపునకు గురి కాకుండా చిలుక వాగులోనే వరద ప్రవహిస్తోందన్నారు. వీరితో పాటు నాయకులు బంటు వేణుగోపాల్, బంటు మల్లప్ప, తదితరులు పాల్గొన్నారు.
తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి