
ఆదాచేస్తేనే ‘గృహజ్యోతి’
మహేశ్వరం: ఎండలు దంచికొడుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతోంది. ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు, ఏసీల వాడకం పెరుగుతోంది. ఫలితంగా విద్యుత్ వినియోగం ౖపైపెకి ఎగబాకుతోంది. ఈ తరుణంలో నెలవారీ యూనిట్లు 200 దాటితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం వర్తించదు. జీరో బిల్లు రావాలంటే కరెంట్‌ను పొదుపుగా వాడటం అనివార్యం. వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రయోజనం చేకూరుతుంది. మహేశ్వరం మండలంలోని 30 గ్రామ పంచాయతీల్లో 29,544 మంది గృహ విద్యుత్ వినియోగదారులు, వీరిలో 10,722 మంది గృహజ్యోతి పథకానికి అర్హులు ఉన్నారు. గత మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రూ.43,11,000 సబ్సిడీ విడుదలైంది. వీరంతా 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగిస్తూ జీరో బిల్లుతో లబ్ధిపొందారు.
ఇవి పాటించాలి
● మార్కెట్‌లో 5స్టార్ రేటింగ్ ఉన్న విద్యుత్ ఉపకరణాలు మాత్రమే వినియోగించాలి.
● ఇంట్లో టీవీ అవసరం లేకపోతే రియోట్‌తో కాకుండా పూర్తిగా ఆఫ్ చేయాలి.
● చార్జింగ్ పూర్తయ్యాక ఫోన్‌ను ఫ్లగ్ నుంచి తొలగించాలి.
● అవసరమైతేనే ఫ్యాన్లు, కూలర్లు వేయాలి.
● రిఫ్రిజిరేటర్‌లో కాలానుగుణంగా ఫ్రీజర్ లెవల్స్‌ను మార్చుకోవాలి.
● ఏసీల ఫిల్టర్లను తరచూ శుభ్రం చేస్తూ, టైమర్‌ను సెట్ చేసుకోవాలి.
● వాషింగ్‌మెషీన్‌లో లోడ్‌కు తగిన దుస్తులు మాత్రమే వేయాలి.
● నాణ్యమైన ఎల్‌ఈడీ బల్బులు వాడాలి.
● అవసరం ఉన్న గదుల్లో, అవసరమైనంత సేపే లైట్లు వేసుకోవాలి.
● ఫ్రిజ్ డోర్‌ను పదేపదే తీయకూడదు. సాధ్యమైనంత త్వరగా మనకు అవసరమైన వస్తువును తీసుకుని వెంటనే డోర్ మూసేయాలి.
ఎండల నేపథ్యంలో పెరుగుతున్న విద్యుత్ వాడకం
200 యూనిట్లు దాటితే
జీరో బిల్లు లేనట్లే
కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చేతికందనున్న పథకం
పొదుపుగా వాడాలి
వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. బల్బులు, ఫ్యాన్లు, కూలర్లు, ఎసీలు, ఫ్రిజ్‌లు, ఐరన్ బాక్సులు వంటివి అవసరానికి మించి ఉపయోగించొద్దు. ఐఎస్‌ఐ మార్కు ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను మాత్రమే వాడాలి. సరైన జాగ్రత్తలు పాటిస్తేనే గృహజ్యోతి వర్తిస్తుంది.
– చక్రపాణి, విద్యుత్ ఏఈ

ఆదాచేస్తేనే ‘గృహజ్యోతి’