
ప్రభుత్వ హామీలపై నిలదీస్తాం
మీర్‌పేట: ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీస్తామని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి స్పష్టం చేశారు. కార్పొరేషన్ పరిధిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద మంజూరైన 83 మంది లబ్ధిదారులకు గురువారం చెక్కులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ప్రతి ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చడంతో పాటు చెక్కులు తీసుకున్న వారందరికీ తులం బంగారం కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంత వరకు మహిళలకు నెలకు రూ.2,500 ఎక్కడా ఇవ్వలేదని విమర్శించారు. మహిళలను కోటీశ్వరులని చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, త్వరలోనే మీర్‌పేట, జిల్లెలగూడలో ఇంటింటికీ వెళ్లి ఎవరు కోటీశ్వరులు అయ్యారో తెలుసుకుంటానని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పథకాన్ని మహిళలను దృష్టిలో పెట్టుకుని అమలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి, కమిషనర్ జ్ఞానేశ్వర్, డీటీ మణిపాల్‌రెడ్డి, స్థానిక నాయకులు అర్కల భూపాల్‌రెడ్డి, అనిల్‌యాదవ్, బొక్క రాజేందర్‌రెడ్డి, జటావత్ శ్రీనునాయక్, అర్కల కామేష్‌రెడ్డి, భూపేష్‌గౌడ్, మాదరి రమేష్, విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సబితారెడ్డి