
● ఉత్తీర్ణత శాతం పెరిగినా ఆఖరు స్థానానికే పరిమితం ● ఎప్
ఫలితాలు నిరాశపరిచాయి
జిల్లా ర్యాంకు చివరన ఉన్నప్పటికీ ఫలితాల పరంగా చూస్తే గతేడాది కంటే మెరుగయ్యాం. తాము ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. ఉపాధ్యాయులు కష్టపడినప్పటికీ ఫలితాలు నిరాశ పరిచాయి. ఈ ఫలితాలను బేరీజు వేసుకుని సప్లిమెంటరీలో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తాం. ఏయే సబ్జెక్టులలో, ఏయే పాఠశాలల్లో తక్కువ ఫలితాలు వచ్చాయో సమీక్షించుకుని సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే వారికోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలని యోచిస్తున్నాం. ఉత్తీర్ణులైన వారందరికీ అభినందనలు.
– జి.రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి
సంతోషంగా ఉంది
పదో తరగతి ఫలితాల్లో అధిక మార్కులు సాధించడం సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు ఇచ్చిన సలహాలు, సూచనలతో చదువుకున్నాను. మాది నిరుపేద కుంటుంబం కావడంతో అమ్మానాన్నలు కష్టపడి చదివిస్తున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు భవిష్యత్‌లో మరింత రాణించేందుకు కృషి చేస్తాను.
– కార్తీక్, నవాబుపేట గురుకుల పాఠశాల

● ఉత్తీర్ణత శాతం పెరిగినా ఆఖరు స్థానానికే పరిమితం ● ఎప్