
సీఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు మేలు
పరిగి: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. మండల పరిధిలోని రంగంపల్లి గ్రామానికి చెందిన పలువురి లబ్ధిదారులకు బుధవారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సీఎంఆర్‌ఎఫ్‌తో ఎంతో మంది నిరుపేదలకు మేలు జరుగుతుందన్నారు. అనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వం సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కృషితో ప్రజలకు సంక్షేమాలను సక్రమంగా అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, నాయకులు వెంకట్, సురేష్, చందర్‌రెడ్డి, వీరారెడ్డి, శేశిరెడ్డి, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.