
సుదీర్ఘ సేవలు అభినందనీయం
అనంతగిరి: విధి నిర్వహణలో మనం ప్రజలకు చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ కార్యాలయంలో వికారాబాద్ మహిళ పీఎస్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన ఎండీ హాషంకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూలమాలలు, శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సుదీర్ఘంగా సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. 41 ఏళ్ల పాటు విధులు చేపట్టారన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఏఓ జ్యోతిర్మణి, ఉమెన్స్ పీఎస్ సీఐ శివచంద్ర, ఆర్‌ఐలు, జిల్లా పోలీసు ప్రెసిడెంట్ అశోక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.