
బాలిక భవానీ
పోలీసుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
యాలాల: జుంటుపల్లి రామస్వామి ఆలయ పుష్కరిణిలో ఓ బాలిక ప్రమాదవశాత్తు పడిపోయింది. పోలీసుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. జాతర ఉత్సవాల్లో భాగంగా ఆలయ దిగువన ఉన్న నీటి గుండం (పుష్కరిణి)లో స్నానమాచరించి దర్శనం కోసం భక్తులు కొండ పైకి తరలివెళుతుంటారు. ఈ క్రమంలో తన కుటుంబంతో జాతర ఉత్సవాలకు వచ్చిన భవానీ అనే బాలిక పుష్కరిణి వద్ద ప్రమాదవశాత్తు నీటిలో పడింది. ఈత రాక నీట మునుగుతున్న బాలికను అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి బయటికిలాగి రక్షించారు. త్రుటిలో ప్రమాదం తప్పడంతో బాలిక కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.