
దరఖాస్తుల స్వీకరణను పరిశీలిస్తున్న సంచిత్ గంగ్వార్
ధారూరు: స్థానిక పంచాయతీ కార్యాలయంలో బుధవారం డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్.. వికారాబాద్ ఆర్డీఓ విజయకుమారి, తహసీల్దార్ భువనేశ్వర్, డీటీ విజయ్‌లతో కలిసి దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పురోగతిపై ఆయన తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. బుధవారం వరకు ధారూరులో 157 మంది, లక్ష్మినగర్ తండాలో 58 మంది, తిమ్మానగర్‌లో 15 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తహసీల్దార్ ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌కు వివరించారు. ఇంతవరకు 230 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అంతకుముందు ధారూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్లను సంచిత్ గంగ్వార్ పరిశీలించారు.