
సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి తదితరులు
పరిగి: ఖబర్దార్ మోదీ.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని డీసీసీ అధ్యక్షుడు టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కుటుంబంపై కేసులు పెట్టి జైల్లో పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాహుల్‌గాంఽధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడానికి నిరసిస్తూ బుధవారం పరిగి బస్టాండ్ వద్ద సత్యాగ్రహదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం వారిదని అన్నారు. పేదలకు కూడు, గుడ్డు ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిన సంస్కరణలే అన్నారు. భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందంటే అది కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధే అని అన్నారు. చిన్న కేసును బూచిగా చూపి రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపమన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్, ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, పట్టణ అధ్యక్షుడు ఏ కృష్ణ, ఆయా మండలాల అధ్యక్షులు పరశురాంరెడ్డి, ఆంజనేయులు, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసులు పెట్టి రాహుల్‌గాంధీ
సభ్యత్వాన్ని రద్దు చేస్తారా?
డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి