
దేవనూరులో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
యాలాల: పథకాల అమల్లో పారదర్శకంగా వ్యవహరిస్తామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. పల్లె పల్లెకూ పైలెట్ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు బుధవారం దేవనూరు, దుబ్బతండా, దేవులాతండా, గోరేపల్లి, సంగెంకుర్దు, హాజీపూర్, కిష్టాపూర్, ముకుందాపూర్, జక్కేపల్లి, బెన్నూరు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గాన్ని ప్రత్యేక నిధులతో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఆసరా పింఛన్ల మంజూరు, పక్కాగృహాల మంజూరులో పారదర్శకత పాటిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను పొరుగు రాష్ట్రాల ప్రజలు మెచ్చుకుంటున్నారని అన్నారు. కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణలో విలీనం చేయాలనే ప్రతిపాదనలు తన దృష్టికి వచ్చిందన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో కొత్త పంచాయతీ భవన నిర్మాణ పనులు, సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. దుబ్బతండా, దేవులాతండా, గోరేపల్లి గ్రామాలకు ఆర్టీసీ బస్సు నడపాలని గ్రామస్తుల కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి త్వరలో బస్సు నడిచేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, వైస్ ఎంపీపీ రమేష్, కోఆప్షన్ సభ్యుడు అక్బర్‌బాబా, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు శివకుమార్, సాయమ్మ, శ్రీలత, ఒంగోనిబాయి శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, నారాయణమ్మ, శాంతిబాయి, పటేల్‌రెడ్డి, ఎంపీటీసీలు మంత్రి మొగులమ్మ, బీఆర్‌ఎస్ యువజన అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, ఏఎంసీ డైరెక్టర్ ఆశన్న, నాయకులు అనంతయ్య ముదిరాజ్, మంత్రి వెంకటయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, లాలప్ప, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
మూడో రోజుకు చేరిన ‘పల్లె పల్లెకూ పైలెట్’