
దాడి ఘటనను కలెక్టర్‌కు వివరిస్తున్న సంఘం నాయకులు
అనంతగిరి: కుల్కచర్ల మండలం బండమీది తండా పంచాయతీ జూనియర్ కార్యదర్శి వెంకటయ్యపై జరిగిన దాడిని జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిపై చర్చలు తీసుకోవాలని సంఘం తరఫున కలెక్టర్, డీపీఓలకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. విధి నిర్వహణ లో ఉన్న ఉద్యోగిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అధ్యక్షుడు రాంచంద్రయ్య, ప్రఽ దాన కార్యదర్శులు ప్రసన్న ఫారూక్, రామకృష్ణ, నర్సింగ్‌రావు, మురళీకృష్ణ, మాణిక్యం, మాధవి, ఇందిర, రజిత, స్వప్న, రవి, శ్రీశైలం, జగన్‌రెడ్డి, రాంవిహార్, కిషన్, ప్రవీణ్, సురేష్, రాములు తదితరులు పాల్గొన్నారు.