అబ్దుల్లాపూర్‌మెట్: ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ నెం.58తో పేదలకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటచారి అధ్యక్షతన నిర్వహించిన మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన 483మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎళ్ల నుంచి ఇంటి పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న పేదలకు మేలు చేసేందుకే సీఎం కేసీఆర్ ఇళ్ల క్రమబద్ధీకరణకు జీఓ 58ను విడుదల చేశారని చెప్పారు. ఇళ్లు లేని పేదలకు గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థికసాయం అందజేస్తుందన్నారు. అర్హులు ఏప్రిల్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, తహాసీల్దార్ అనితారెడ్డి, ఎంపీపీ బుర్ర రేఖ, జెడ్పీటీసీ సభ్యుడు దాస్‌గౌడ్ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.