
ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు
తాండూరు టౌన్: వచ్చే ఎన్నికల్లో తాండూరులో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ అన్నారు. శుక్రవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా పట్టణాధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర పభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఆయుష్మాన్ భారత్, సుకన్య సమృద్ధి యోజన, ఈ శ్రామ్ కార్డ్స్, ఉజ్వల యోజన వంటి పలు పథకాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలను తామే అమలు చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉద్యోగులకు ఉన్న వ్యతిరేకత అర్థమవుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో తాండూరులో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ప్రజల చేతిలో బీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌కుమార్, కార్యదర్శి భద్రేశ్వర్, అసెంబ్లీ కన్వీనర్ రజినీకాంత్, కౌన్సిలర్‌లు లలిత, లావణ్య, బాలప్ప, పట్టణ ప్రధాన కార్యదర్శి దోమ కృష్ణ, ఉపాధ్యక్షులు కోట్ల నరేందర్, నాయకులు శాంత్‌కుమార్, పూజారి పాండు, సతీష్, సంగమేశ్వర్, ఉమాదేవి, రేణుక, ఆర్తి, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర పథకాలనుసద్వినియోగం చేసుకోండి
జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్
పట్టణంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం