ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేలు ఇస్తామని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. అంతా భ్రాంతిగానే మిగిలిపోయింది. 2014లో కూడా ఇలాగే మోసం చేశారు. చంద్రబాబు మాదిరిగానే లోకేష్‌కు కూడా ఇది అలవాటుగా మారిపోయింది.
– శకుంతల, ఎమ్మెస్సీ పీహెచ్‌డీ
మూగబోయింది
యువగళం పాదయాత్ర అంటూ హంగామా చేసిన మంత్రి లోకేష్ అధికారం వచ్చిన తర్వాత ఆ గళం మూగబోయింది. భృతి అందిస్తూ ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తామని, ఇప్పుడు ఆ ప్రస్తావనే ఎత్తడం లేదు. యువతను మోసం చేసిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదే. – శివ శంకర్ నాయక్,
జీఎన్‌ఎస్ రాష్ట వ్యవస్థాపక అధ్యక్షుడు
ఇప్పటికై నా నెరవేర్చాలి
రెండు ఏళ్లుగా జిల్లాలో సుమారు 15వేల మంది విద్యార్థులకు ఫీజురీయింబర్స్ మెంట్ అందలేదు. దీంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను టార్ఛర్ పెట్టి ఫీజులు కట్టించుకున్నాయి. ఫీజు కట్టిన వారికే హాల్‌టికెట్లు, సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఇప్పటికై నా విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.
– భార్గవ్, జై భారత్ విద్యార్థి విభాగం అధ్యక్షులు
గాలికి వదిలేశారు
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ నారా లోకేష్ గాలికి వదిలేశారు. నిరుద్యోగ యువతను వంచించారు. ఒక్క మాటను కూడా నిలబెట్టేకునే ప్రయత్నం కూడా చేయకపోవడం దారుణం. ఇలాంటి నేతలను ఎక్కడా చూడలేదు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు.
– ఆషా, పీడీఎస్‌ఓ, జిల్లా కార్యదర్శి


