నేటి నుంచి ‘నృత్యవాహిని’
తిరుపతి రూరల్ : నగరంలోని శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో అంతర్జాతీయ సాంస్కృతిక నృత్య మహోత్సవం (నృత్య వాహిని) నేటి నుంచి ప్రారంభమవుతుందని వీసీ ఆచార్య ఉమ తెలిపా రు. నృత్యోత్సవాల నిర్వహణపై బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 13వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే నృత్య మహోత్సవానికి దేశ, విదేశాల నుంచి నృత్యకారులు హాజరవుతున్నట్టు తెలిపారు. ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్చేంజ్ డాన్స్ ఫెస్టివల్–2025 గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. నవంబరు 15 వరకు జరిగే నృత్యోత్సవాల్లో ఆంధ్రప్రదే శ్, మహారాష్ట్రతో పాటు థాయ్‌లాండ్, శ్రీలంక నుంచి వచ్చిన 87 మంది కళాకారులు పాల్గొంటారన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్టు వీసీ ఉమ తెలిపారు. ఈ ఉత్సవాలను వర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. రజని, కన్వీనర్లు ఆచార్యసి.వాణీ, ఆచార్య పి. విజయలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.హిమబిందు పర్యవేక్షించనున్నారు.


