త్రుటిలో తప్పిన ప్రమాదం
పెళ్లకూరు : నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారిపై కొత్తూరు గ్రామం వద్ద శనివారం ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ప్రమాదం త్రుటిలో తప్పింది. వివరాలు.. రాజమండ్రి నుంచి బెంగళూరుకు 34మంది ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్ ఏసీ బస్సు ప్రమాదవశాత్తు ఐరన్ బారికేడ్లను ఢీకొని పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రయాణికులను మరో బస్సులో బెంగళూరుకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


