నేడు పాఠశాలలకు సెలవు
తిరుపతి సిటీ: జిల్లాలో భారీ వర్షాలు కురు స్తున్న కారణంగాఈ నెల 22 తేదీన జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు బుధవా రం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ తెలిపారు. జిల్లాలో వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నందున తి రుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మే రకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ప్రై వేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు పే ర్కొన్నారు. ఈ నేపథ్యంలో డీవైఈఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు తమ పరిధి లోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఈ సమాచారాన్ని వెంటనే చేరవేయాలన్నారు. విద్యాసంస్థలు పని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరీక్షా విభాగం పనితీరుపై ఆ వర్సిటీ వీసీ నరసింగరావు మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షా విభాగంలోని ఉద్యోగులు తమ పనితీరును మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫలితాలు నిర్ణీత సమయంలో విడుదలయ్యేలా సంబంధిత అధికారులు చొర వ చూపాలని ఆదేశించారు. ఉద్యోగులు విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని, క్రమశిక్షణతో నిజాయితీగా వ్యవహరించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. పరీక్షకు సంబంధించిన పనిలో నిర్లక్ష్యం, అలసత్వం, ఆలస్యం, క్రమశిక్షణా రాహిత్యం జరిగితే సహించబోమని స్పష్టం చేశారు. ఏదైనా లోపాలకు సంబంధిత సిబ్బంది వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తారని, ఎక్కడ నిర్లక్ష్యం గమనించినా కఠిన చర్యలకు వెనుకాడబోమనని హెచ్చరించారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ భూపతినాయుడు, పరీక్షల డీన్ ఆచార్య సురేంద్ర బాబు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ రాజమాణిక్యం, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, పరీక్ష విభాగం సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్ అర్జీలపై
శ్రద్ధ పెట్టండి
తిరుపతి అర్బన్: పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. సమీక్షకు జూమ్ కా న్ఫరెన్స్ ద్వారా తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడు తూ మండల, డివిజన్, కలెక్టరేట్‌లో జరు గుతున్న పీజీఆర్‌ఎస్‌కు క్రమం తప్పకుండా అధికారులు హాజరుకావాలని చెప్పారు. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపించే దిశగా పనిచేయాలని పేర్కొన్నారు. మండల, డివిజన్ స్థా యిలో పీజీఆర్‌ఎస్ నిర్వహించడంలో నిర్లక్ష్యం చూపితే వారిపై శాఖాపరమైన చర్యలు తప్ప వని హెచ్చరించారు. ప్రధానంగా కలెక్టరేట్‌లో తాగునీరు, వీధి లైట్లు, దారి సమస్య, శ్మశానం సమస్య తదితర అనేక అంశాలకు సంబంధించి కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు ఇస్తున్నారని చెప్పారు. కలెక్టరేట్‌లో అ ర్జీలు ఇవ్వడం తప్పులేదని, అయితే చిన్న చిన్న సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కారిసత్తే, అర్జీదారులు వ్యయప్రయాసాలకోర్చి కలెక్టరేట్‌కు రావాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. గ్రీవెన్స్‌ను ప్రతిష్ట్మాకంగా భావించి ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు.
దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి కల్చరల్ : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ, రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో భాగంగా ఈనెల 28వ తేదీన జరిగే జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలకు యువ కళాకారులను ఆహ్వానిస్తున్నట్లు సెట్విన్ సీఈఓ య శ్వంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు ఈనెల 28న ఉదయం 9.30 గంటలకు నరసింహతీర్థం రోడ్డులోని ఎమరాల్డ్స్ డిగ్రీ, పీజీ కళాశాల జరుగుతాయన్నారు. జానపద గ్రూపు నృత్యాలు, జానపద గ్రూపు గీతాలు వాయిద్య కళాకారులతో సహా 10 మంది చొప్పున పాల్గొనవచ్చని తెలిపారు. కవిత్వం, ఇంగ్లీషు, హిందీ భాషలో ప్రకటన పోటీలు ఉంటాయని తెలిపారు. ప్రథమ స్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పోటీలలో 16 నుంచి 29 ఏళ్ల వయస్సులోపు కలిగిన యు వత పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 27వ తేదీ లోపు తమ పేర్లను పుట్టి తేదీ, పోటీలో పాల్గొనే అంశాలతో కూడి దరఖాస్తులను వాట్సాప్ నంబర్ 8341111687లో సంప్రదించాలని తెలిపారు.
వైఎస్సార్‌సీపీలో నియామకాలు
చిత్తూరు అర్బన్ : వైఎస్సార్ సీప్టీలో జిల్లాకు చెందిన పలువురికి చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా యువత విభాగం కార్యదర్శిగా కె.కళ్యాణ్‌కుమార్ (పలమనేరు), అసెంబ్లీ ని యోజకవర్గ ఉద్యోగులు–పెన్షనర్ల విభాగం అ ధ్యక్షులుగా చీకాల శివప్రసాద్ (పూతలపట్టు), కె.నాగభూషణం (పలమనేరు), పి.సుబ్రమణ్యం (సత్యవేడు) నియమితులయ్యారు.


