
ఆందోళనగా ఉంది
రెండు కిడ్నీలు దెబ్బతిన్నట్లు మూడేళ్ల క్రితం తెలిసింది. ఇక అప్పటి నుంచి చికిత్సపొందుతున్నా. అయినప్పటికీ అనారోగ్యంతో ఏ పనీ చేసుకోలేని స్థితిలో ఉన్నా. ఎప్పుడు ఏం జరుగుతుందో ఆందోళనగా ఉంది. గతంలో చేతిబోరులోని నీటినే తాగేవాడిని. ఆ నీటి కారణంగానే కిడ్నీ వ్యాధి వచ్చిందని ఇప్పుడు కొందరు చెబుతున్నారు. నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. సమస్యలను కనిపెట్టి పరిష్కరిస్తే గ్రామానికి మంచి జరుగుతుంది. – దేవళ్ల పెద్ద చెంగయ్య(65),
కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, పాళెంపాడు
చెడు అలవాట్లు లేవు
నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. అయినప్పటికీ రెండేళ్ల క్రిందట రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇప్పుడు ఏం తినాలన్నా.. కనీసం నీరు తాగాలన్నా భయమేస్తోంది. ఏ పని చేయలేక, ఇంటి వద్దనే ఉంటున్నా. గ్రామంలో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
– దేవళ్ల చిన్నచెంగయ్య(62),
కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, పాళెపాడు
నీటి కారణంగానే..
గ్రామంలో చేతి బోరులో నీరు తాగడం వల్లే కిడ్నీలు పాడయ్యాయయి. ఇందులో నాకు ఎలాంటి అనుమానం లేదు. అయితే కొందరు బయటి ప్రాంతాల నుంచి క్యాన్ వాటర్ తెచ్చుకుని వాడుకుంటున్నప్పటికీ కిడ్నీ సమస్యలు తలెత్తాయి. నేను రెండేళ్ల నుంచి కిడ్నీ వ్యాధికి చికిత్స పొందుతున్నా. నరకం అనుభవిస్తున్నా. – సమ్మన పరదేశయ్య(60)
కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, పాళెంపాడు
కలుషిత నీటితోనే..
పాళెంపాడులో కలుషిత నీటిని తాగడం వల్లే పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడ్డారు. అక్కడి చేతిబోర్లలోని నీటిని తిరుపతిలోని మైక్రోబయాలజీ ల్యాబ్‌కు పంపాం. ఆ నీటిలో బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. అలాగే బోరు నీటిలో ఖనిజ లవణాలు పెరగడం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతిని ఉండవచ్చు. ఊరిలోని పేడ దిబ్బల కారణంగా కూడా నీరు కలుషితమవుతోంది.
– వి.చైతన్య, వైద్యాధికారి, డీవీ సత్రం పీహెచ్‌సీ

ఆందోళనగా ఉంది

ఆందోళనగా ఉంది

ఆందోళనగా ఉంది