
వేదపారాయణదారుల ఇంటర్వ్యూల రద్దు సరికాదు
● టీటీడీ చైర్మన్ ఉద్దేశపూర్వకంగానే ఆపారు ● మీడియా సమావేశంలో భూమన కరుణాకర్‌రెడ్డి
తిరుపతి అన్నమయ్యసర్కిల్: టీటీడీలో వేదపారాయణదారుల నియామకానికి సంబంధించి జరగాల్సిన ఇంటర్వ్యూలను ఉన్నఫలంగా రద్దు చేయడం సమంజసం కాదని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. గురువారం తిరుపతిలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేదపారాయణదారుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోందన్నారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం వేదపారాయణదారుల అవసరం ఎంతో ఉందనే విషయాన్ని గుర్తించి గతంలో తాను పాలకమండలి చైర్మన్‌గా ఉన్నపుడు 700 పోస్టులను క్రియేట్ చేశామన్నారు. నియామకాలకు సంబంధించి గురువారం నిర్వహించాల్సిన ఇంటర్వ్యూలను ఉద్దేశపూర్వకంగా ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఆపినట్టుగా బయట చర్చ జరుగుతోందన్నారు. ఈ వేదపారాయణ ఇంటర్వ్యూలకు సంబంధించి ఉన్నతమైన సంస్కారం కలిగిన వ్యక్తి అన్ని విషయాల పట్ల కూలంకుషంగా చర్చ చేసి నిజ నిర్ధారణ వచ్చిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారి డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోవిందరాజన్ ఆధ్వర్యంలో కృష్ణ యజుర్వేదం విభాగం అధ్యాపకుడైన ఫణియజ్ఞేశ్వరయాజులు నేతృత్వంలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారనే విషయం అందరికీ తెలిసిందేదారులను టీటీడీ తీసుకుంటే ఎంతో మేలు జరిగేదన్నారు. కాగా చెర్మన్ ఉద్దేశపూర్వకంగా ప్రతిభావంతుడైన గోవిందరాజన్‌ను పక్కన పెట్టాలనే ఈ ఇంటర్వ్యూలను ఆపడం అభ్యంతకర విషయంగా భావించాల్సి ఉందన్నారు. తనకు కావలసిన వాళ్లను వేదపారాయణదారులుగా తీసుకోవాలనే కుట్ర తప్ప మరొక్కటి లేదన్నారు. గోవిందరాజన్‌ను తప్పించడం చాలా పెద్ద తప్పిదమన్నారు.