
వైన్‌షాప్ పెడితే సహించం!
తిరుపతి రూరల్ : మండలంలోని గాంధీపురం గ్రామానికి చెందిన మహిళలతో పాటు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీనగర్ కాలనీ వాసులు బుధవారం రోడ్డెక్కారు. తమ ప్రాంతంలో వైన్‌షాపును ఏర్పాటు చేయవద్దని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాంతంలో బార్ పెట్టొద్దని గతంలో పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. కాపురాలున్న చోట మందుబాబులను అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టి తాగించడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు సైతం నానా అవస్థలు పడేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు బార్ మూసేశారని, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ ఉంటే, ఇంతలోనే అదే చోట వైన్‌షాపు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. కాలేజీలు, పాఠశాలలకు పిల్లలను పంపించాలంటే ఈ మద్యం దుకాణం ముందు నిలబడి విద్యాసంస్థల బస్సులు ఎక్కించాల్సి వస్తుందని వాపోయారు. ప్రభుత్వానికి డబ్బులే కావాలనుకుంటే మరోచోట మద్యం దుకాణం పెట్టించుకోవాలని, ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించకుంటే ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు.
అడ్డుకుంటాం
గతంలో బార్ పెట్టినపుడు నిరసనను వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఎన్ని పోరాటాలు చేసినా బార్‌ను మూసివేయించలేకపోయాం. ఇప్పుడు గత నాలుగు రోజులుగా బార్ మూత వేశారు. బార్ లేకపోవడంతో ప్రశాంతంగా ఉంది. రెండు రోజుల్లో మద్యం దుకాణం పెడతామని చెబుతున్నారు. వైన్‌షాప్ పెడితే కచ్చితంగా అడ్డుకుంటాం. ఎకై ్సజ్ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం.
– యశోద, గాంధీపురం