
జాతీయ సదస్సు విజయవంతానికి కృషి
తిరుపతి అర్బన్ : తిరుపతి వేదికగా తొలిసారి నిర్వహిస్తున్న జాతీయ మహిళా సాధికారిత సదస్సును విజయవంతం చేయడానికి సకల వసతులు కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం 300 మంది సచివాలయ ఉద్యోగులకు సదస్సులో చేపట్టాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. తిరుపతి స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి లైజన్ అధికారులకు సదస్సు నిర్వహణకు చెందిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగులు లైజన్ అధికారులకు వ్యవహరించాల్సి ఉంటుందని...14,15 తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు చైర్మన్‌గా దగ్గుపాటి పురంధేశ్వరి వ్యవహరిస్తారని చెప్పారు. హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్ అప్పగించారు. కార్యక్రమంలో తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ప్రోటోకాల్) శివశంకర్ నాయక్, సచివాలయ ఉద్యోగులు (లైజన్) పాల్గొన్నారు.