
ప్రతి పక్షనేత వచ్చాక కేంద్రానికి లేఖ ఏమిటో?
మామిడికి నెలరోజులుగా గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. వారిని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించిన తరువాత వ్యవసాయశాఖ మంత్రి అచ్చన్నాయుడు కేంద్రానికి లేఖ రాయడం ఏమిటో తెలియడం లేదు. ఓ పత్రికలో రైతులను దండుపాళెం బ్యాచ్‌గా చిత్రీకరించడం సరికాదు. వారి కష్టాలను ఆ పత్రికలు గుర్తించాల్సి ఉంది. వారికి అండగా ఉండాలే తప్ప, వారికి వ్యతిరేకంగా కథనాలు రాయడం మంచిది కాదు.
– అత్తిరాల సురేష్, రైతు, అంజూరు, కేవీబీపురం మండలం