
బీర్ బాటిల్‌తో దాడి
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఆటో స్టాండులో మద్యం తాగిన వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి బీరు బాటిల్‌తో దాడి చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం ఉత్తనూరు గ్రామానికి చెందిన హరికి మద్యం తాగే అలవాటు ఉంది. గత మూడు రోజులుగా తిరుపతిలో కొత్తగా పరిచయమైన వ్యక్తితో కలసి మద్యం సేవించాడు. ఈ క్రమంలో ఆదివారం హరికి పరిచయమైన వ్యక్తితో ఆదివారం మాటామాటా పెరిగి గొడవ కావడంతో హరి చేయి చేసుకున్నాడు. సోమవారం ఉదయం మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఆటో స్టాండులో ఒంటరిగా ఉన్న హరిపై సదరు గుర్తు తెలియని వ్యక్తి బీరు బాటిల్‌తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గట్టిగా అరవడంతో దాడి చేసిన వ్యక్తి పరారవగా రక్తగాయాలతో పడి ఉన్న హరిని రుయా ఆస్పత్రికి తరలించారు. తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు ఆస్పత్రిలో బాధితున్ని కలసి గొడవకు గల కారణాలను తెలుసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.