
అనిల్‌పై దాడి చేసిన టీడీపీ నేతలను అరెస్టు చేయాలి
తిరుపతి మంగళం : లోకేష్ రెడ్‌బుక్ పాలనలో కూటమి నేతలు చేస్తున్న అరాచకాలకు ప్రజలే చరమగీతం పాడుతారని, కార్పొరేటర్ బోకం అనిల్‌కుమార్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయకపోతే రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తామని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. తిరుపతి–కరకంబాడి మార్గంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిల్‌కుమార్‌ను శుక్రవారం భూమన కరుణాకరరెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కుటుంబానికి మీకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. పోలీస్ వ్యవస్థపై తనకు ఎంతో గౌరవం, నమ్మకం ఉందని, ఆ నమ్మకంతోనే కార్పొరేటర్ అనిల్‌పై దాడి చేసిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకుని న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని భూమన అన్నారు.
న్యాయం జరగకపోతే ఉద్యమమే
ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన భూమన

అనిల్‌పై దాడి చేసిన టీడీపీ నేతలను అరెస్టు చేయాలి