
పాధిని ప్రాథమిక హక్కుగా ఉద్యమించండి
తిరుపతి కల్చరల్: రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌లకు ధారాదత్తం చేస్తున్న నరేంద్రమోదీని సాగనంపేందుకు యువత, విద్యార్థులు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య 17వ జాతీయ మహాసభలు గురువారం సాయంత్రం తిరుపతి ఇందిరామైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా డి.రాజా పాల్గొని ప్రసంగించారు. మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ఈ హామీని అమలుచేసి ఉంటే 20 కోట్ల ఉద్యోగాలు దేశంలో ఇచ్చి ఉండాలని, అధికారంలోకి రాగానే హామీని తుంగలో తొక్కి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉపాధి హక్కును ప్రాథమిక హక్కుగా చేర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను అలవంబిస్తున్న మోదీని సాగనంపేందుకు యువత నడు బిగించాలని కోరారు. సేవ్ ప్రభుత్వం రంగ స్థలను మోదీ, ఆదానీ, అంబానీలాంటి కార్పొరేట్‌లకు ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్దమైన స్వతంత్ర వ్యవస్థగా నడవాలని, రాజకీయాలకు అతీతంగా ఉండాలని స్పష్టం చేశారు. నాడు ఇంద్రగుప్త అధ్యక్షతన నియమించిన కమిటీ ఎన్నికల సంస్కరణలను సిఫార్సుచేసిందని అయితే ఆ కమిటీ సిఫార్సులను పాలకులు తుంగలో తొక్కారన్నారు. భారత్ పాక్ మధ్య చెలరేగుతున్న వివాదంలో జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిరంతర సంక్షోభాన్ని సృష్టించారని పేర్కొన్నారు. మతాల మధ్య ఘర్షణలు సృష్టించి, మతోన్మాద ఉద్వేషాన్ని రెచ్చగొడుతూ లబ్ధి పొందాలని బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు.
20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ?
మోదీని సాగనంపేందుకు
యువత నడుం బిగించాలి
సీపీఐ జాతీయ నేత డి.రాజా పిలుపు