
● రథోత్సవం.. లక్ష్మీనారసింహం
● తిరుపతిలోని చింతల చేను సమీపంలో ఓ భారీ భవనం నిర్మిస్తున్నారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ నుంచి జీ ప్లస్ త్రీ అనుమతులు తీసుకుని ఏకంగా ఐదు అంతస్తుల భవంతికి శ్రీకారం చుట్టి.. శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇంతలో ప్లానింగ్ సెక్రటరీ పరిశీలనకు వచ్చారు. నిర్మాణ పనులను వెంటనే ఆపేయాలని అల్టిమేటం జారీ చేశారు. మిమ్మల్ని మా సార్ రమ్మంటున్నారు, ఒకసారి ఆఫీస్‌కి వెళ్లి కలవండి అంటూ సలహా ఇచ్చారు. చేసేది లేక సదరు భవన నిర్మాణదారుడు రెండు రోజుల తర్వాత ప్లానింగ్ ఆఫీసర్‌ని కలిసి ప్రసన్నం చేసుకున్నాడు. దీంతో అక్రమ నిర్మాణం.. వెంటనే సక్రమం అయిపోయింది.
● స్థానిక కరకంబాడి రోడ్డులోని డీమార్ట్‌కు ఎదురుగా అనుమతులకు విరుద్ధంగా ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. ఆ కట్టడానికి సెట్ బ్యాక్ వదలలేదు. అయినప్పటికీ టౌన్ ప్లానింగ్ విభాగంలోని ఓ అధికారి ఈ అక్రమ నిర్మాణానికి అన్నీ తానై సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ భవనానికి సమీపంలోనే ఓ ఇంటి వద్ద నాలుగు అడుగుల ముందుకు రేకులు వేసుకున్నారు. ఈ విషయం గమనించిన స్థానిక ప్లానింగ్ సెక్రటరీ కొంత నగదు డిమాండ్ చేశారు. ఆయన అడిగినంత సొమ్మునుఇవ్వకపోవడంతో కక్షగట్టినట్టు ఇంటి ముందు రేకులను తొలగించి తమ ప్రతాపం చూపించారు.

● రథోత్సవం.. లక్ష్మీనారసింహం

● రథోత్సవం.. లక్ష్మీనారసింహం