
సదస్సులో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తదితరులు
శ్రీకాళహస్తి: సేంద్రియ పద్ధతులతో సాగు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని ఏపీ సీడ్స్‌లో ఐపీటీడీ శాస్త్రవేత్త డాక్టర్ మోహన్‌కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథులుగా ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం హాజరయ్యారు. ముందుగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపాలన్నారు. పంటలకు రసాయన ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని వెల్లడించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి మట్లాడుతూ ఐపీటీడీ ఆధ్వర్యంలో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారన్నారు. గతంలో పేడను ఎరువుగా వాడుకుని పంటలను పండించేవారని, అందుకే పెద్దల కాలంలో 80 నుంచి 90 ఏళ్లపాటు ఆరోగ్యంగా జీవించారని వివరించారు. దిగుబడి తక్కువగా ఉన్నా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలకు ఎక్కువ రేటు ఉంటుందని తెలిపారు. తొట్టంబేడు మండలం పూడి గ్రామానికి చెందిన శ్యామ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం చేపట్టి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని వెల్లడించారు. సేంద్రియ సాగుపై అవగాహన కల్పించే బ్రోచర్ ఆవిష్కరించారు. రైతులకు కిట్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరాల కమిటీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ప్రకాష్ యాదవ్, ఉన్నం వాసునాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు సుబ్బారెడ్డి, ముత్యాల పార్థసారథి, వయ్యాల కృష్ణారెడ్డి, బత్తిరెడ్డి, మణినాయుడు, ప్రభాకర్‌రెడ్డి, రమణయ్యయాదవ్, వడ్లతాంగల్ బాలాజీ ప్రసాద్‌రెడ్డి, చంద్రయ్యనాయుడు, రెడ్డి శేఖర్, బోర్డు మెంబరు భాస్కర్, సుమతి, నాయకులు శివకుమార్‌యాదవ్, పఠాన్ ఫరీద్, పసల కృష్ణయ్య, పవన్ పాల్గొన్నారు.