
ఎంపికై న బాలబాలికలతో జిల్లా చీఫ్ కోచ్, గ్రాప్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం గ్రాప్లింగ్ జూనియర్, సీనియర్ జిల్లా జట్లను ఎంపిక చేశారు. రాష్ట్ర గ్రాప్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపిక పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జూనియర్, సీనియర్ కేటగిరిలో బాలబాలికలు హాజరయ్యారు. వీరికి వేర్వేరుగా పోటీలు నిర్వహించి, ప్రతిభకనబరిచిన 30 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు గ్రాప్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సురేంద్రారెడ్డి తెలిపారు. జిల్లా జట్లుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 23, 24 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న 3వ రాష్ట్ర స్థాయి గ్రాప్లింగ్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారన్నారు. క్రీడాకారులను జిల్లా చీఫ్ కోచ్ సయ్యద్‌సాహెబ్ అభినందించారు. ఈ పోటీలకు డీ.సాయిసుమతి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.