
అశోక్ లేలాండ్ సర్వీస్ సెంటరును ప్రారంభిస్తున్న శివప్రసాద్‌రెడ్డి
రేణిగుంట: రేణిగుంట కేఎల్‌ఎం ఆస్పత్రి కూడలి వద్ద శుక్రవారం ఆటోమోటీవ్ మ్యానుఫాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అశోక్ లేలాండ్ 8బే వర్క్‌షాప్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆటోమోటీవ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఈడీ రాజీవ్ సంఘ్వి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అతిపెద్ద కమర్షియల్ వెహికల్ వర్క్‌షాపును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో 104 సర్వీస్ టచ్ పాయింట్లు ఉన్నట్లు తెలిపారు. అశోక్ లేలాండ్ డీలర్ నెట్వర్క్‌లో తమ సంస్థ అతి పెద్దదన్నారు. టిప్పర్లు, ట్రావెల్ బస్సులు, ఐసీవీ గూడ్స్ వాహనాలకు 24గంటలు సేవలను ఈ సెంటర్ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. మాజీ డీసీసీబీ చైర్మన్ సిద్ధాగుంట సుధాకర్‌రెడ్డి, ఆటోమోటీవ్ బ్రాంచి మేనేజర్ శివప్రసాద్‌రెడ్డి, అశోక్ లేలాండ్ ఏరియా మేనేజర్ రఘునాథ్‌ద్, ఏపీ సర్వీస్ హెడ్ రమేష్, రీజనల్ సర్వీస్ మేనేజర్ దుర్గాప్రసాద్, మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.