
గజగమనా.. గరిక ప్రియా.. ఉమాతనయా.. ఏక దంతా.. వక్రతుండా.. వర అభయా.. వీర విఘ్నేశా.. మా హారతులందుకో.. మమ్ము
కరుణించు.. కరివదనా.. అని భక్తులు వరసిద్ధుడిని చిన్న, పెద్ద శేషవాహన సేవల్లో భక్తిశ్రద్ధలతో కొలిచారు.
కాణిపాకం(యాదమరి): కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సిద్ధి, బుద్ధి, సమేత వరసిద్ధుడు చిన్న, పెద్ద శేషవాహనాలపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వేకువజా మున మూలవిరాట్‌కు ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకం, అలంకరణ, అర్చన, ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు దర్శనం కల్పించారు. ప్రధాన ఆలయం, స్వర్ణ ధ్వజస్తంభం, సుపథ మండపాన్ని సుగంధభరిత పుష్పాలతో శోభయమానంగా అలంకరించారు. అనంతరం ఉభయకర్తల ఆధ్వర్యంలో మూలవిరాట్‌కు అభిషేకం, అలంకరణ, పూ జలు నిర్వహించి, ఉభయకర్తలకు ప్రత్యేక దర్శనం కల్పించారు. అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత గౌరీ సుతునికి విశేషాలంకరణ చేసి, చిన్న శేష వాహనంలో కొలువుదీర్చారు. మేళతాళాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ పురవీధుల్లో వాహనసేవ జరిపారు.
కనుల పండువగా పెద్ద శేషవాహనం
రాత్రి అలంకార మండపంలో అర్చకులు సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామివారికి సుగంధభరిత పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. ఉభయకర్తలు, ఆలయ అధికారులు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి బంగారు పెద్ద శేష వాహనంలో కొలువుతీర్చారు. ప్రత్యేక పూ జల అనంతరం మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనల నడుమ పెద్దశేష వాహన సేవ నిర్వహించారు. పూజలకు కాణిపాకం, కాకర్ల వారిపల్లె, వడ్రాంపల్లె, మి ట్టఇండ్లు, కొత్తపల్లె, అడపగుండ్లపల్లె, బొమ్మసముద్రం, తిమ్మోజిపల్లె, తిరువణంపల్లె, చిగరపల్లె, అగరంపల్లెకు చెందిన కమ్మ సామాజిక వర్గీయులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.
వైభవం.. శత కలశ క్షీరాభిషేకం
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామివారికి ఉభయకర్తల ఆధ్వర్యంలో శత కలశ క్షీరాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారి అనుబంధ ఆలయం నుంచి ఉభయకర్తలు, వారి కుటుంబసభ్యులు శత క్షీర కలశాలను మేళతాళాలు, కేరళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఆలయ కల్యాణ వేదికలో కొలువుదీర్చిన సిద్ధి, బుద్ధి, సమేత వినాయక స్వామివారి విగ్రహాలకు ఆలయ అర్చకులు శేఖర్ స్వామి ఆధ్వర్యంలో క్షీర, గంధ, పంచామృత అభిషేకాలు నిర్వహించి, పూజలు చే శారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈఓ వెంకటేశు, సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ మణి నాయుడు, మాజీ సర్పంచ్ మధుసూదన్, ఏఈఓ ఎస్వీ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, ఇన్‌స్పెక్టర్ బాబు పాల్గొన్నారు.
నేడు వృషభ వాహన సేవ
కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు వృషభవాహనంలో ఊరేగనున్నారు. ఉద యం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, అర్చన, పూజలు నిర్వహించనున్నారు.

పెద్ద శేషవాహనంపై స్వామివారు
