మరో మహిళతో అక్రమ సంబంధం.. భర్తకు బడితెపూజ చేసిన భార్య

Wife Attacked Husband Over Illegal Affair Warangal - Sakshi

సాక్షి, వరంగల్: మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు దేహశుద్ధి చేసింది భార్య. అతను ఉండే ఇంటిపై బంధువులతో కలిసి దాడి చేసింది. ఫర్నీచర్‌ను ధ్వంసం చేసింది.వరంగల్ జిల్లా పైడిపల్లిలో ఈ ఘటన జరిగింది.

భార్య చేతిలో తన్నులు తిన్న ఈ భర్త పేరు జీవన్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సూపరింటెండెంట్‌గా ఉద్యోగం చేసేవాడు. రూ.కోటి అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలతో రెండు సంవత్సరాల క్రితమే సస్పెండ్ అయ్యాడు. అయితే జీవన్ మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య ఆవేదన ‍వ్యక్తం చేస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా తీరు మారకపోడవంతో ఆగ్రహంతో బంధువులతో కలిసివెళ్లి చితకబాదింది.
చదవండి: ప్రేమ పేరుతో మోసం తిరుపతిలో నిందితుడి అరెస్టు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top