ఉద్యోగుల కోసం.. వర్చ్యుసా కోవిడ్‌ కేర్‌.. | Virtusa Covid Care For Employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల కోసం.. వర్చ్యుసా కోవిడ్‌ కేర్‌..

May 10 2021 8:29 PM | Updated on May 10 2021 8:29 PM

Virtusa Covid Care For Employees - Sakshi

కొవిడ్‌ మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత సమయంలో ఉద్యోగుల భద్రత సంస్థలకు అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంలా మారింది. ఉచిత వ్యాక్సినేషన్‌ దగ్గర్నుంచి విభిన్న రకాలుగా వారికి సాయం అందేలా సంస్థలు వారి క్షేమం పట్ల తమ చిత్తశుధ్దిని చాటుకుంటున్నాయి. 

పోర్టల్‌తో మద్ధతు..
అదే క్రమంలో డిజిటల్‌ వ్యూహాలు, డిజిటల్‌ ఇజనీరింగ్, ఐటి సేవలు, పరిష్కారాలను అంతర్జాతీయంగా అందించే  వర్చ్యుసా కార్పొరేషన్‌... వ్యక్తిగతమైన ఫీచర్లతో రూపొందించిన  24/7 కొవిడ్‌ 19 కేర్‌ పోర్టల్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో ఒక విశిష్టమైన అంశం ఏమిటంటే, ప్రతి ఒక్క టీమ్‌ సభ్యుడు, వారి కటుంబాలకు సంబంధించి ఆరోగ్యపరంగా ప్రతీ విషయాన్నీ ఈ పోర్టల్‌ పట్టించుకుంటుంది. వారికి 24/7 ప్రత్యక్ష మద్దతు, సహకారాలు అందిస్తూ.. , వ్యాక్సినేషన్లకు సంబంధించి టీమ్‌ సభ్యుల డేటాను పోర్టల్, కాల్‌ సెంటర్‌ పర్యవేక్షిస్తాయి. ‘‘సంస్థ సిబ్బంది మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యుల సంరక్షణ కూడా మాకు ప్రధానమే.  అందుకే ఈ పోర్టల్‌ మేం ప్రారంభించాం’’ అని వర్చ్యుసా ఛీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ నారాయణన్‌ తెలిపారు. ‘‘ప్రపంచంలో ఎక్కడైనా ఏ సంక్షోభ పరిస్థితి తలెత్తినా దీనిని వినియోగించుకొనేలా ఓ డిజిటలైజ్‌  నమూనాను నిర్మించడం మా ఉద్దేశం‘ అన్నారాయన. 

వార్‌ రూమ్‌..రెడీ...
 ఈ పోర్టల్‌తో పాటు,  కొవిడ్‌19 సంరక్షణ, సేవలను అందించడం కోసం ఒక వార్‌ రూమ్‌ను కూడా సంస్థ సృష్టించింది. అలాగే సంస్థ సిబ్బందికి ఆసుపత్రులు, ఇళ్ళు, క్వారంటైన్‌ కేంద్రాల్లో కొవిడ్‌కు ముందు, అనంతర సంరక్షణ కూడా అందిస్తోంది. రవాణా, ఔషధాలు, ఆహారం, ఆసుపత్రుల్లో పడకలు, అంబులెన్స్‌ లు, ఆక్సిజన్‌ సిలెండర్లు సంపాదించడంలో సాయం, ఇంట్లో వారి సంరక్షణతో సహా అదనపు సహాయాన్ని కూడా అందిస్తోంది. ఎక్కడి నించి విజ్ఞప్తి వచ్చినా సహాయం అందించేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా చెన్నై, హైదరాబాద్‌లలో తాత్కాలిక కొవిడ్‌ కేంద్రాలు, ఐసోలేటెడ్‌  ఉద్యోగుల కోసం  ఏర్పాటు చేశారు. వీరికి వర్చ్యుసా సిబ్బంది, ఆ ప్రాంతాల్లోని ప్రసిద్ధమైన ఆసుపత్రులకు చెందిన వైద్య నిపుణులు సహకారం అందిస్తున్నారు. దీనితోపాటు, కన్వల్సెంట్‌ ఫ్లాస్మా దాతల  డేటాబేస్‌ను కూడా ఏర్పాటు చేసింది. 

ఆన్‌లైన్‌ కన్సల్టేషన్స్, హామ్‌ క్వారంటైన్‌ బీమా..
ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి అందుబాటులో ఉంచడం కోసం ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లకు వర్చ్యుసా ఆర్డర్లు పెట్టింది. అలాగే. వైద్యులు, పోషకాహార నిపుణులూ, ఆరోగ్య శ్రేయస్సు నిపుణులతో ఉచిత ఆన్‌లైన్‌ కన్సల్టేషన్లను కూడా రోజంతా అందిస్తోంది. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి ఉద్యోగుల సంక్షేమ నిధిని  వినియోగిస్తోంది, అలాగే టీమ్‌ సభ్యులలో అవసరం ఉన్నవారెవరికైనా వారి మానసిక, శారీరక ఆరోగ్యం కోసం సాయం అందించడానికి వర్చ్యువల్‌ కనెక్ట్‌ నిర్వహిస్తోంది. టీమ్‌ సభ్యులకూ, వారి కుటుంబాలకూ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. హోమ్‌ క్వారంటైన్‌ వైద్య బీమా పథకాన్ని కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement