
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 13,422 మందికి కరోనా పరీక్షలు చేయగా 39 మందికి పాజిటివ్ వచ్చింది. శుక్రవారం 13,689 మందికి పరీక్షలు చేయగా 52 మంది కరోనా బారిన పడ్డారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 7.92 లక్షలకు చేరింది.