
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 42 మంది కోవిడ్–19 బారిన పడ్డారు. ఇప్పటివరకు 792295 మందికి కోవిడ్–19 నిర్ధారణ కాగా, వీరిలో 787795 మంది కోలుకున్నారు. మరో 389 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4111 మంది కరోనా వైరస్‌తో మృతి చెందారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 13,761 కోవిడ్–19 పరీక్షలు నిర్వ హించారు. ఇందులో 747 నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉందని వైద్యారోగ్య శాఖ చెప్పింది.