బడి షురూ ఎలా?

Telangana Government Confusion Mode Open Schools After Corona Pandemic - Sakshi

తర్జనభర్జన పడుతున్న ప్రభుత్వం...

మెజారిటీ రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి

ఏపీ సహా పది రాష్ట్రాల్లో విద్యాబోధన ప్రారంభం...

అత్యధిక రాష్ట్రాల్లో తెరుచుకోని బడులు

రాష్ట్రంలోనూ వీలైతే డిసెంబర్‌లో.. లేదంటే జనవరిలో ప్రారంభించే యోచన

అప్పటికీ కుదరకపోతే యాక్టివిటీ/ప్రాజెక్టు బేస్డ్‌ విద్య ప్రకారమే పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌ : బోధనలేక బడి బోసిపోయింది. తరగతి గది చిన్నబోయింది.. బ్లాక్‌బోర్డు తెల్లబోయింది.. ఆవరణను నిశ్శబ్దం ఆవరించింది.. పాఠాలులేవు.. ఆటపాటలు అసలేలేవు.. కరోనా సృష్టించిన కల్లోలం జాడలు ఇంకా వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యాబోధనపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఆన్‌లైన్, డిజిటల్‌ (టీవీ పాఠాలు, వీడియో పాఠాలు) విద్యాబోధనను సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభించినా అది పూర్తిస్థాయి ప్రత్యక్ష విద్యాబోధనతో సమానం కాదన్న విషయాన్ని అధికారులే అంగీకరిస్తున్నారు.

విద్యార్థులను ఖాళీగా ఉంచకూడదనే ఉద్దేశంతో  చేపట్టిన ప్రత్యామ్నాయ విధానమే తప్ప దాని ద్వారా పెద్దగా ఫలితాలను సాధించలేమని పేర్కొంటున్నారు. ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభిస్తే ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదివే 30 లక్షలమంది, ప్రైవేటు పాఠశాలల్లో చదివే 31 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తారు కనుక కరోనాను అధిగమించి ఎలా ముం దుకు సాగాలన్న దానిపైనే వివిధ కోణాల్లో ఆలోచనలు చేస్తున్నారు. దీనిపై ఇటీవల గురుకులాల సొసైటీ, విద్యాశాఖ అధికారులతోనూ చర్చించారు. మరోవైపు ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులపైనా చర్చించారు. అయితే అందులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీఎంతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

సీఎం అంగీకరిస్తే దశలవారీగానే.. 
రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభానికి సీఎం ఒప్పుకున్నా, దశలవారీగానే నిర్వహించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. తాజా భేటీలోనూ మొదట 9, 10 తరగతుల్లోనే బోధన చేపట్టే అంశంపై చర్చించారు. వీలైతే వచ్చే నెలలో 9, 10 తరగతులకు ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభించి దశలవారీగా అన్ని తరగతులకు విస్తరిస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చించారు. కరోనా ప్రభావం తగ్గి, పరిస్థితులు అనుకూలంగా ఉంటే వచ్చే నెలలో తరగతులను ప్రారంభించేలా నిర్ణయం తీసుకునే విషయాన్ని సీఎంకు విన్నవించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. లేదంటే జనవరిలో కచ్చితంగా ప్రారంభించేలా కార్యాచరణను సిద్ధం చేసి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

రవాణా సదుపాయం, హాస్టళ్ల నిర్వహణా ప్రధానమే..
ఒకసారి పాఠశాలల ప్రారంభానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆయా విద్యార్థుల రవాణా సదుపాయం, ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లు, గురుకులాల ప్రారంభంపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని దాదాపు 30 లక్షలమంది విద్యార్థుల్లో 8 లక్షల మందికిపైగా విద్యార్థులు గురుకులాల్లోనే ఉన్నారు. మరోవైపు సంక్షేమ హాస్టళ్లలోనూ విద్యార్థులు ఉన్నారు. వీటికితోడు ప్రైవేటు స్కూళ్లకు చెందిన హాస్టళ్లలో కూడా విద్యార్థులు ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయా అంశాలన్నింటిపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 

నాలుగు నెలలు నిర్వహిస్తేనే పరీక్షలు..
విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించాలంటే కనీసంగా నాలుగు నెలల పాటు(120 రోజులు) ప్రత్యక్ష విద్యాబోధన అవసరమని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అందుకు వచ్చే నెలలోగానీ, జనవరిలోగానీ కచ్చితంగా బోధనను ప్రారంభించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కరోనా ప్రభావం కనుక తగ్గకపోతే ప్రస్తుతం ప్రత్యామ్నాయ అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం అమలు చేస్తున్న యాక్టివిటీ/ప్రాజెక్టు బేస్డ్‌ విద్యాబోధనను కొనసాగించాల్సి వస్తుందని, వాటి ఆధారంగానే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

గతేడాది నాలుగు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్, ఒక సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్ష జరిగినందున విద్యార్థులను పైతరగతులకు ప్రభుత్వం ప్రమోట్‌ చేసిందని, ఇప్పుడు అది సాధ్యం కాదని పేర్కొంటున్నారు. అయితే విద్యార్థులకు వార్షిక పరీక్షలు కచ్చితంగా ఉంటాయని చెబుతున్నారు. దీనిపై త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంటున్నారు.

మెజారిటీ రాష్ట్రాల్లో తీసుకోని నిర్ణయం..
ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో ప్రత్యక్ష విద్యాబోధన ఎలా కొనసాగుతోందన్న దానిపై విద్యాశాఖ ఓ నివేదికను రూపొందించింది. ఆ నివేదికపైనా ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు చర్చించారు. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో పాఠశాలల ప్రారంభానికి నిర్ణయం తీసుకోగా, అందులో కొన్ని ఇçప్పటికే స్కూళ్లను ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్‌ నవంబర్‌ 2వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించింది. అయితే మెజారిటీ రాష్ట్రాల్లో పాఠశాలల ప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కర్ణాటకలో పాఠశాలలను ప్రారంభించినా మళ్లీ మూసివేశారు. 

పాఠశాలలు ప్రారంభించని ప్రధాన రాష్ట్రాలు..
కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, కేరళ, ఢిల్లీ, మేఘాలయ, హర్యానా, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, జార్ఖండ్, లడఖ్‌ రాష్ట్రాల్లో పాఠశాలల ప్రారంభంపై ఇంతవరకు అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలేదు. తమిళనాడులో ఈనెల 16 నుంచి ప్రారంభించాలని భావించారు. ఒడిషాలోనూ ఈ నెల 16వ తేదీ నుంచి పై తరగతులకు (9 నుంచి 12వ తరగతి వరకు) విద్యా బోధన ప్రారంభించాలని అనుకున్నారు.

ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభించిన రాష్ట్రాలు..
ఆంధ్రప్రదేశ్, అస్సాం, సిక్కిం, మిజోరాం, త్రిపుర, బిహార్‌ రాష్ట్రాలు ప్రత్యక్ష విద్యాబోధనను ప్రారంభించాయి. ఉత్తరప్రదేశ్‌లో అక్టోబర్‌ 19వ తేదీన 9, 10 తరగతులకు ప్రారంభించారు. హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పాండిచ్చేరిలో నవంబర్‌ 2వ తేదీ నుంచి 10 నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన ప్రారంభించారు. 

ప్రభుత్వ నిర్ణయం మేరకే: దేవసేన, పాఠశాల విద్యా కమిషనర్‌ 
పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు ముందుకు సాగుతాం. ప్రత్యక్ష బోధన ప్రారంభానికి ప్రభుత్వం ఓకే అంటే అమలు చేసేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే, కరోనా పరిస్థితులను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అప్పటివరకు ప్రత్యామ్నాయ విద్యావిధానాన్ని (యాక్టివిటీ/ప్రాజెక్టు బేస్డ్‌) కొనసాగిస్తాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

18-01-2021
Jan 18, 2021, 10:54 IST
సాక్షి, లక్నో : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నివారణకుగాను ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లకు వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తరుణంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో విషాదం చోటు...
18-01-2021
Jan 18, 2021, 05:52 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర జనాభాలో ఏకంగా 20 శాతానికి పైగా...
18-01-2021
Jan 18, 2021, 03:55 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ప్రక్రియ రెండో రోజూ చురుగ్గా కొనసాగింది. ఉదయం 9 గంటలకే వ్యాక్సిన్‌ ప్రక్రియ...
17-01-2021
Jan 17, 2021, 15:07 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో వ్యాక్సిన్‌...
17-01-2021
Jan 17, 2021, 13:28 IST
‘మా అన్నయ్య చనిపోయాడు. ఇంక నాకీ లోకంలో ఎవరూ లేరు’ అని  ఓ అమ్మాయి ఏడుస్తుంటే..  ‘అయ్యో.. అలా అనకు.. నీకు నేనున్నా’...
17-01-2021
Jan 17, 2021, 10:13 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనాపై అవగాహన కోసం కేంద్రం ఆదేశాల మేరకు ప్రతి టెలికాం సంస్థ విధిగా వినిపిస్తోన్న కాలర్...
17-01-2021
Jan 17, 2021, 05:49 IST
బీజింగ్‌: బీజింగ్‌ దక్షిణ ప్రాంతంలో కరోనా కేసులు తిరిగి నమోదవుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కేవలం 5 రోజుల్లోనే 1,500...
17-01-2021
Jan 17, 2021, 05:43 IST
న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ టీకా మాత్రమే తమకు ఇవ్వాలని ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా(ఆర్‌ఎంఎల్‌) ఆసుపత్రి రెసిడెంట్‌...
17-01-2021
Jan 17, 2021, 05:34 IST
బీజింగ్‌: కరోనా వైరస్‌ జాడలున్న 4,800 ఐస్‌క్రీం బాక్సులను చైనా అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమై ఈ వైరస్‌ ఎక్కడి...
17-01-2021
Jan 17, 2021, 05:22 IST
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదయిన కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో శనివారం ప్రారంభమైంది. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది...
17-01-2021
Jan 17, 2021, 05:04 IST
ఓస్లో: కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నార్వేలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఇటీవల ఫైజర్‌వ్యాక్సిన్‌ తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి...
17-01-2021
Jan 17, 2021, 04:56 IST
భారత్‌లో ఉత్పత్తి చేసిన టీకాలతో కరోనా మహమ్మారిపై నిర్ణయాత్మక విజయం సాధించడం తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం...
17-01-2021
Jan 17, 2021, 03:23 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలి రోజు కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ విజయవంతమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు...
16-01-2021
Jan 16, 2021, 19:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. నేడు మొత్తంగా 1,65,714 మంది కరోనా నిరోధక వ్యాక్సిన్‌...
16-01-2021
Jan 16, 2021, 17:00 IST
హైదరాబాద్‌: కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న వారు దుష్ప్రభావాల బారిన పడితే నష్టపరిహారం చెల్లిస్తామని భారత్‌ బయోటెక్‌  ప్రకటించింది. తమ వ్యాక్సిన్‌...
16-01-2021
Jan 16, 2021, 16:52 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,542 మందికి కరోనా పరీక్షలు చేయగా 114 మందికి...
16-01-2021
Jan 16, 2021, 14:21 IST
వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణలో ఇదొక మైలురాయి వంటిది. భారతీయుల కోసం ప్రభావంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్‌ను తీసుకువచ్చేందుకు ఈ నెలలోనే...
16-01-2021
Jan 16, 2021, 13:04 IST
అతి త‌క్కువ జీవిత‌కాలం ఉన్న‌వారు టీకా తీసుకోవడం వల్ల పెద్ద‌గా ప్రయోజనం ఉండ‌దు
16-01-2021
Jan 16, 2021, 12:19 IST
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో...
16-01-2021
Jan 16, 2021, 10:48 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. శనివారం ఉదయం 10:30...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top