కరోనా సెకండ్‌ వేవ్‌: తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌

Telangana Government Alert In Wake Of Corona Second Wave - Sakshi

ప్రతి పడకకూ ఇక ఆక్సిజన్‌!

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో సర్కార్‌ అప్రమత్తం

మరో 11 వేల బెడ్లకూ ఆక్సిజన్‌ ఏర్పాటుకు సన్నాహాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 5,000 పడకలు..

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ భయంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం సన్నాహాలు మొదలుపెట్టింది. కరోనాపై యుద్ధం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం అధికారులు ఆగమేఘాల మీద రంగంలోకి దిగారు. ఎంతటి విపత్కర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు ప్రణాళిక రచిం చారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రు ల్లోని ప్రతీ బెడ్‌కు ఆక్సిజన్‌ సౌకర్యాన్ని అందు బాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 22 వేల పడకలుండగా, వాటిల్లో 11 వేల పడకలకు మాత్రమే ఆక్సిజన్‌ సౌకర్యముంది.   (ప్రపంచానికి శనిలా పట్టుకుంది!)

మిగిలిన 11 వేల పడకలకు కూడా ఆక్సిజన్‌ను అందు బాటులోకి తేవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వంద పడకలకు పైగా ఉన్న ఆసుపత్రు లకు లిక్విడ్‌ ఆక్సిజన్‌ను, అంతకంటే తక్కువున్న ఆసుపత్రులకు సాధారణ ఆక్సిజన్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలు, గాంధీ ఆసుపత్రి వరకు మధ్య ఉన్న అన్ని ఆసుపత్రుల్లోనూ ఏర్పాట్లు చేయనున్నట్లు చెబుతున్నారు. మొదటి వేవ్‌లో కొన్ని దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొ న్నాయి. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.  (ఐరోపా దేశాల్లో 17 సెకన్లకు ఒక మరణం)

5,000 అదనపు పడకలు...
సీఎం ఆదేశాలతో సెకండ్‌ వేవ్‌ వస్తే ఎలా ఎదుర్కోవాలో యంత్రాంగం జిల్లా వైద్యాధి కారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు మొదలు పెట్టారు. సోమవారం వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తన పరిధిలోని జిల్లా వైద్యాధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఇప్పటికే వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో ఉన్న జిల్లా, ఏరియా, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో 8,874 పడకలున్నాయి. అందులో రెగ్యులర్‌ పడకలు 5,394, సింగిల్‌ లైన్‌ ఆక్సిజన్‌ పడకలు 2,810, వెంటిలేటర్‌ సౌకర్యం లేని మూడు లైన్ల ఆక్సిజన్‌ పడకలు 486, వెంటిలేటర్‌ సౌకర్యమున్న ఆక్సిజన్‌ పడకలు 184 ఉన్నాయి. వీటికి అదనంగా మరో 5 వేల పడకలను అందుబాటులోకి తేవాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.   (యూరప్‌లో థర్డ్‌ వేవ్‌!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top