మాజీ మంత్రి చాంబర్‌ నుంచి ఫర్నిచర్‌ తరలింపు! | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి చాంబర్‌ నుంచి ఫర్నిచర్‌ తరలింపు!

Published Thu, Dec 7 2023 2:29 PM

student Leaders Stopped Shifting Furniture From EX Minister Srinivas Goud Office - Sakshi

గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్‌): రవీంద్రభారతిలో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చాంబర్‌ నుంచి కొందరు ఫర్నిచర్‌ను తీసుకువెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం కొంతమంది వ్యక్తులు ఫర్నిచర్‌ను తీసుకువెళుతుండగా ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆ వ్యక్తులకు, ఓయూ జేఏసీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్‌ను ఎలా తీసుకువెళతారని జేఏసీ నాయకులు వారిని ప్రశ్నించారు. దీంతో వారు ఫర్నిచర్‌ను అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఈ ఘటనపై టీజీఓ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ, తమ కార్యాలయంలో వినియోగించుకునేందుకు ఆ ఫర్నిచర్‌ను తీసుకువెళ్లాలనుకున్నామని, అయితే అది ప్రభుత్వానిదని తెలియడంతో ఆ ప్రయత్నం మానుకున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement