‘థాంక్స్‌ పప్పు’.. కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్‌ | MLC Kavitha Wishes To BrotherOn Birthday, Here Is KTR Funny Reply | Sakshi
Sakshi News home page

HBD KTR: ‘థాంక్స్‌ పప్పు’.. కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్‌

Jul 24 2021 7:53 PM | Updated on Jul 24 2021 8:18 PM

MLC Kavitha Wishes To BrotherOn Birthday, Here Is KTR Funny Reply - Sakshi

సాక్షి, హైద‌రాబాద్ : నేడు (జూలై 24) టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి. సాధారణ పౌరుడి నుంచి, సీని రాజకీయ ప్రముఖులందరూ కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావు ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయురారోగ్యాల‌తో మ‌రింత‌కాలం ప్ర‌జా జీవితంలో కొన‌సాగాల‌ని హ‌రీష్ రావు ఆకాంక్షించారు. కాగా హ‌రీష్ రావు ట్వీట్‌కు కేటీఆర్ బ‌దులిచ్చారు.. థాంక్స్ బావ అంటూ ట్వీట్ చేశారు.

థాంక్స్‌ పప్పు
ఇదిలా ఉంటే కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తన ట్విట్టర్ వేదికగా చెబుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య అంటూ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ థాంక్స్ పప్పు అంటూ ధన్యవాదాలు చెప్పారు. కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సందర్భంగా కేటీఆర్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. మరోవైపు టాలీవుడ్‌ సెలబ్రిటీలైన అల్లు శీరిష్‌, తమన్‌, బండ్ల గణేష్, అనసూయ, ఈషారెబ్బా, సుధీర్‌ బాబు, ప్రదీప్‌ మాచిరాజు, అడవి శేషుతో పాటు పలువురు కేటీఆర్‌కు విషెస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement