‘ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేసి తీరుతాం’ | SLBC Project To Be Completed Despite Challenges, Says Minister Komatireddy Venkata Reddy | Sakshi
Sakshi News home page

‘ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేసి తీరుతాం’

Nov 3 2025 8:30 PM | Updated on Nov 4 2025 11:57 AM

Minister Komatireddy Venkat Reddy On SLBC Tunnel

నాగర్ కర్నూల్:  రెండు దశాబ్దాలుగా నిలిచిపోయిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) ప్రాజెక్టును తమ ప్రభుత్వం కచ్చితంగా పూర్తి చేసి తీరుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామన్నారు 

ఈరోజు(సోమవారం, నవంబర్‌ 3వ తేదీ) అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ఎస్ఎల్‌బీసీ టన్నెల్-1 ప్రాంతంలో హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వేలో సీఎం రేవంత్‌, రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,,ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ రెండు దశాబ్దాలుగా నిలిచిపోయిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) ప్రాజెక్టును మా ప్రభుత్వం తిరిగి చేపట్టి,  సాంకేతిక సవాళ్లను అధిగమిస్తూ ముందుకు వెళ్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేను అమెరికాకు వెళ్లి టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని తెప్పించాను. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకపోతే ఇదే పనులు చాలా కాలం క్రితం పూర్తయ్యేవి.

SLBC పూర్తయితే 30 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందే అవకాశం ఉంది. దీనివల్ల విద్యుత్ ఖర్చులు గణనీయంగా తగ్గి ప్రభుత్వానికి భారీ ఆదా లభిస్తుంది. మూసి నది శుద్ధీకరణతో నల్లగొండకు శాశ్వత నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ ప్రాజెక్టులలో ఒకటి. ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగించుకుంటూ దీనిని పూర్తి చేయాలన్నది ప్రభుత్వ దృఢ సంకల్పం. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ చానెల్ ద్వారా అందుబాటులోకి తెస్తాం.

పునరావాస ప్యాకేజీలను డిసెంబర్ 31 నాటికి పూర్తిచేస్తాం. భూములు కోల్పోయిన వారికి నష్టం జరగకుండా పూర్తి సహాయం అందిస్తాం’అని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement