టీఎన్జీఓ అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్‌ | Maram Jagadishwar is the president of TNGO | Sakshi
Sakshi News home page

టీఎన్జీఓ అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్‌

Mar 30 2026 3:32 AM | Updated on Mar 30 2026 3:32 AM

Maram Jagadishwar is the president of TNGO

ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్‌ ఎన్నిక

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ అధికా రుల సంఘం అధ్యక్షు డిగా మారం జగ దీశ్వర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్‌ నియ మితుల య్యారు. ఆదివారం గచ్చిబౌలిలోని టీఎన్జీఓ హౌసింగ్‌ సొసైటీ ఆవరణలో ఎన్నికల అధి కారి సుగుణాకర్‌ రెడ్డి, సహాయ ఎన్నికల అధి కారి సురేశ్‌ ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది. 

అధ్యక్ష పదవికి ఒకేఒక్క నామినేషన్‌ రావడంతో మారం జగదీశ్వర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి ఎన్నిక కూ డా ఏకగ్రీవం అయింది. కార్యవర్గ సభ్యులుగా 17మంది నామినేషన్‌ దాఖలు చేయడంతో వారిని నియమించారు. అధ్యక్ష, కార్యదర్శు లుగా మారం జగదీశ్వర్, ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్‌ వరుసగా రెండోసారి ఎన్నిక య్యారు. అనంతరం అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యద ర్శులు నూతన అధ్యక్ష, కార్యద ర్శులను సన్మానించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement