
తగ్గేదే లేదు.. ఆఫీస్ స్పేస్ అయినా.. ఉద్యోగాలైనా.. టాప్ నగరాల్లో మన హైదరాబాద్ ఉండాల్సిందే. ‘వి ఆర్ సిటీ 2024’ పేరుతో ‘అన్ బాక్సింగ్‌బీఎల్‌ఆర్ ఫౌండేషన్ ’ రూపొందించిన నివేదిక ఇదే చెబుతోంది. ఖరీదైన ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రావడంతో కొత్తగా జత కూడిన ప్రధాన ఉద్యోగాల సంఖ్య పరంగా దేశంలో బెంగళూరు తర్వాత రెండో స్థానంలో భాగ్యనగరం నిలిచింది.
ఆసక్తికర విషయం ఏమంటే.. 7 ప్రధాన నగరాల్లో 2018–23 మధ్య కార్మికుల్లో మహిళల వాటా అత్యధికంగా దాదాపు రెండింతలు పెరిగింది హైదరాబాద్‌లోనే. అలాగే 2019–23 మధ్య 6.3 లక్షల చదరపు అడుగుల గ్రేడ్–ఏ మాల్ స్పేస్ తోడై టాప్–5 స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశీయంగా అయిదేళ్లలో అత్యధికంగా 27 నగరాలు, పట్టణాలకు విమాన సేవలను బెంగళూరు విస్తరిస్తే, హైదరాబాద్ 18 కేంద్రాలతో టాప్–2లో పోటీపడుతోంది.
ఇంటి రుణం సగటు అధికంగా ఉన్న టాప్–3 నగరాల్లో హైదరాబాద్ చోటు సంపాదించింది. దశాబ్ద కాలంలో కొత్తగా ఏర్పాటైన కంపెనీల సంఖ్య పరంగానూ సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుంది.