‘లింక్‌’ ప్యాకేజ్‌... అనుసంధాన రోడ్లకు రూ.2410 కోట్లు | Sakshi
Sakshi News home page

‘లింక్‌’ ప్యాకేజ్‌... అనుసంధాన రోడ్లకు రూ.2410 కోట్లు

Published Sun, Jul 31 2022 7:37 AM

Hyderabad Government Is Ready To Give High Priority To Link Roads - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ప్రధాన రహదారులతోపాటు లింక్‌ రోడ్లకు సైతం అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌) ఆధ్వర్యంలో నగరంలో రెండు దశల్లో చేపట్టిన మిస్సింగ్, లింక్‌ రోడ్లతో ప్రజలకు మంచి ప్రయోజనం కలిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మూడో ఫేజ్‌లో జీహెచ్‌ఎంసీతోపాటు జీహెచ్‌ఎంసీని ఆనుకొని ఉన్న 10 యూఎల్‌బీల్లోనూ ఆయా కారిడార్లలో మిస్సయిన, లింక్‌ తెగిన ప్రాంతాల్లో మిస్సింగ్, లింక్‌రోడ్ల ఏర్పాటుకు, ఆయా కారిడార్ల అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధమైంది.

ఇందులో భాగంగా ఏకంగా 104 కారిడార్లలో (రోడ్లలో) పనులు చేపట్టేందుకు పురపాలనశాఖ రూ.2410 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. వీటిల్లో రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో  50 కారిడార్లలో 120.92 కి.మీల మేర పనులను ప్రాధాన్యతాక్రమంలో చేపట్టేందుకు అనుమతినిచ్చింది. ఈ నిధులను హెచ్‌ఎండీఏ అంతర్గత వనరుల నుంచి కానీ, ఆరి్థక సంస్థల నుంచి రుణాలుగా కానీ సేకరించాలని ఆదేశించింది. ఈ మేరకు హెచ్‌ఆర్‌డీసీఎల్‌ ఎండీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.    

ప్యాకేజీ–1 
7 కారిడార్లు  25.20 కి.మీల లింక్‌ రోడ్లు వ్యయం రూ. 304 కోట్లు. 
ఈసానది తూర్పువైపు బాపూఘాట్‌ బ్రిడ్జి నుంచి పీఅండ్‌టీ కాలనీ. 
కొత్తూరులో రైల్వే క్రాసింగ్‌ నుంచి కుమ్మరిగూడ జంక్షన్‌. 
కొత్తూరు వై జంక్షన్‌ నుంచి వినాయక స్టీల్‌ (ఎన్‌హెచ్‌44)వరకు.  
శంషాబాద్‌లో ఎన్‌హెచ్‌ 44 బస్టాప్‌ నుంచి ఒయాసిస్‌ ఇంటర్నేషనల్‌. 
శంషాబాద్‌ రైల్వే క్రాసింగ్‌ నుంచి ధర్మగిరి రోడ్‌. 
ఎన్‌హెచ్‌ తొండుపల్లి జంక్షన్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ సరీ్వస్‌రోడ్‌. 
గొల్లపల్లి ఎన్‌హెచ్‌ జంక్షన్‌–ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్‌.  

ప్యాకేజ్‌ –2 
10 కారిడార్లు  27.20 కి.మీల లింక్‌ రోడ్లు వ్యయం రూ. 330 కోట్లు. 

 • ఆర్‌సీఐ ఎక్స్‌ రోడ్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌ హోటల్‌ శ్రీశైలం హైవే వరకు 
 • మల్లాపుర్‌ క్రాస్‌ రోడ్‌ నుంచి  కుర్మగూడ వరకు 
 • కుర్మగూడ నుంచి  నాదర్‌గుల్‌ వరకు 
 • బడంగ్‌పేట మెయిన్‌ రోడ్‌ నుంచి  తుర్కంజల్‌ వయా రామయ్య నాదర్‌గుల్‌ వరకు  
 • అంబేద్కర్‌ జంక్షన్‌ నుంచి అక్టోపస్‌  వరకు  
 • ఇంజాపూర్‌  రోడ్‌  నుంచి మునుగురు  రోడ్‌  
 • తొర్రూర్‌ నుంచి నాగార్జున సాగర్‌ రోడ్‌ 
 • ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ టూ డీఎల్‌ఆర్‌ఎల్‌  కాలనీ (వయా టీకేఆర్‌ కాలేజ్‌ రోడ్‌) 
 • వనస్థలిపురం రోడ్‌ టూ  ఓల్డ్‌  హయత్‌నగర్‌ రోడ్‌  
 • బడంగ్‌పేట–నాదర్‌గుల్‌ మెయిన్‌ రోడ్‌ –నాదర్‌గుల్‌ రోడ్‌ 

ప్యాకేజ్‌–3 
13 కారిడార్లు  33.35 కి.మీల లింక్‌ రోడ్లువ్యయం రూ. 417 కోట్లు. 

 • రోజ్‌గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌  దోమల గూడ నుంచి  నాగారం రోడ్‌ కనెక్టింగ్‌  టూ ఈసీఐఎల్‌  
 • చేర్యాల జేఎన్‌ఎన్‌యూఎం హౌసింగ్‌  కాలనీ నుంచి అహ్మాద్‌గూడ ఆర్‌జీకే  వరకు  
 • ఫిరంగ్‌ కట్టా నుంచి ఎనీ్టఆర్‌ విగ్రహాం రోడ్‌ వరకు – ఎన్టీఆర్‌గ్రహంనుంచి దోమలగూడ రోడ్‌ (మున్సిపల్‌ పరిధిలో ) వరకు 
 • ఎన్టీఆర్‌  విగ్రహం నుంచి డంపింగ్‌ యార్డ్‌   
 • ఎన్టీఆర్‌ విగ్రహం నుంఇ వంపుగూడ రోడ్‌   
 •  రాంపల్లి ఎక్స్‌రోడ్‌  నుంచి సర్వే నెంబర్‌  421  
 • సర్వే నెంబర్‌ 421నుంచి యమన్‌పేట నగరం యూఎల్‌బీ బౌండ్రీ– 
 • చర్లపల్లి నుంచి ఓఆర్‌ఆర్‌ సరీ్వస్‌రోడ్‌ వయా కరీంగూడ  
 • యామన్‌పేట ఫ్లైఓవర్‌ నుంచి డబుల్‌ బెడ్‌రూమ్‌  ఇళ్ల  వరకు  
 • చర్లపల్లి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌ నుంచి రాంపల్లి జంక్షన్‌ వరకు  
 • యామన్‌పేట్‌  నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్‌ 
 • శివరెడ్డిగూడెం నుంచి మాధవ్‌రెడ్డి బిడ్జ్రి 

ప్యాకేజ్‌–4 

 • 11 కారిడార్లు  24.64 కి.మీల లింక్‌ రోడ్లు వ్యయం రూ.297 కోట్లు. 
 •  ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి కోకపేట 
 • చెవేళ్ల  రోడ్‌ టూ రాధా రియాల్టీ కార్పొరేషన్‌ రోడ్‌ 
 • చెవేళ్ల  రోడ్‌ (బాలాజీనగర్‌)నుంచి రాధా రియాల్టీ కార్పొరేన్‌ 
 •  లింక్‌ రోడ్‌ నార్సింగ్‌ అప్పా సర్వీస్‌ రోడ్‌ నుంచి చెవేళ్ల –రాధ రియాల్టీ  కార్పొరేషన్‌ రోడ్‌ 
 •  ఓఆర్‌ఆర్‌  సర్వీస్‌ రోడ్‌ నుంచి చెవేళ్ల  రోడ్‌ వయా కిస్మత్‌పురా 
 • వివేకనంద విగ్రహం కిస్మత్‌పురా నుంచి  ఆర్‌అండ్‌ బీ రోడ్‌ 
 • హనుమాన్‌ దేవాలయం నుంచి  కైసర్‌ నగర్‌  నుంచి మైతలి నగర్‌ జాజుల రామారం 
 • అమీన్‌పురా నుంచి  హెచ్‌ఎంటీకాలనీ మియాపూర్‌ వరకు 
 • వీఎన్‌ఆర్‌  కాలేజీ బాచుపల్లి నుంచి  పోట్టి శ్రీరాములు తెలుగుయూనివర్సిటీ  
 • నిజాంపేట వరకు ఎన్‌హెచ్‌ 44 నుంచి ఇండస్ట్రీ ఏరియా రాంరెడ్డినగర్‌  వయా ఫాక్స్‌ సాగర్‌ వరకు

ప్యాకేజ్‌–5  
9 కారిడార్లు  10.53 కి.మీల లింక్‌ రోడ్లు వ్యయం రూ.152 కోట్లు. 

 • రాజ్‌భవన్‌ రోడ్‌ నుంచి ఆర్‌అండ్‌బీ అతిథిగృహాం, లింక్‌రోడ్‌  బేగం పేట రైల్వేస్టేషన్‌ 
 • ప్రకాశ్‌నగర్‌  నుంచి బ్రాహా్మణవాడి  రైల్వే ట్రాక్‌  వయా పార్క్‌  
 • బైరాగి గూడ నుంచి  నార్సింగి వరకు  
 • దర్గా నుంచి  ఎల్‌వీ ప్రసాద్‌ కంటి  ఆసుపత్రి వరకు 
 • ఫర్మాయిస్‌  హోటల్‌ నుంచి తారమతి బారాదరి వయా కేంద్రీయా విహార్‌ అపార్ట్‌మెంట్‌ 
 • కుత్బుల్లాపూర్‌ రోడ్‌ నుంచి పైప్‌లైన్‌రోడ్‌ వయా గోదావరి హోస్‌ 
 • కుత్బుల్లాపూర్‌ రోడ్‌  నుంచి పైప్‌లైన్‌ రోడ్‌ వయా సెయింట్‌  అంథోని హైసూ్కల్‌ వెన్నలగడ్డ చెర్వు 
 • ఎన్‌సీసీ జంక్షన్‌ నుంచి  అడిక్‌మెట్‌ ఫ్లైఓవర్‌ ఓయూ కంపౌండ్‌ వాల్‌ 
 •  ప్రగతి  నగర్‌ నుంచి మహదేవ్‌పురం పశువుల ఆసుపత్రి వరకు  

(చదవండి: ప్రకృతి వైద్యానికి కేరాఫ్‌గా హైదరాబాద్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement