మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు కన్నుమూత  | EX MLA Boggarapu Seetharamaiah Passed Away In Khammam District | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు కన్నుమూత 

May 8 2021 8:17 AM | Updated on May 8 2021 8:34 AM

EX MLA Boggarapu Seetharamaiah Passed Away In Khammam District - Sakshi

సాక్షి, వైరా: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య (85) అనారోగ్యంతో శుక్రవారం హైదరా బాద్‌లో కన్నుమూశారు. కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన ఈయన.. ఇరవై ఏళ్లుగా హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. 1978లో సుజాతనగర్‌ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొదటిసారి అప్పటి ఇందిరా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పువ్వాడ నాగేశ్వర్‌రావుపై గెలుపొందారు.

స్వాతంత్య్ర సమరయోధుడిగా.. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సీతారామయ్య హైకోర్టులో న్యాయవాదిగా కూడా పని చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
చదవండి:  ఆర్బీకేల ద్వారానే సేకరణ.. మిల్లర్ల ప్రమేయం వద్దు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement