రిజిస్టర్డ్‌ పార్టీగా వైఎస్సార్‌టీపీ | EC Gives Recognition To YS Sharmila YSRTP | Sakshi
Sakshi News home page

రిజిస్టర్డ్‌ పార్టీగా వైఎస్సార్‌టీపీ

Feb 24 2022 3:17 AM | Updated on Feb 24 2022 3:30 PM

EC Gives Recognition To YS Sharmila YSRTP - Sakshi

బుధవారం లోటస్‌పాండ్‌లోని కార్యాలయంలో తల్లి విజయమ్మ,  భర్త అనిల్‌తో కలసి కేక్‌ కట్‌ చేస్తున్న పార్టీ అధినేత్రి షర్మిల  

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీగా ఆవి ర్భవించింది. ప్రజాప్రతినిధ్య చట్టం–1951లోని సెక్షన్‌ 29 కింద వైఎస్సార్‌టీపీని రిజిస్టర్‌చేసినట్టు ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న పార్టీ అధ్య క్షురాలు షర్మిలకు లేఖ రాసింది. బుధవారం అందిన లేఖలో ఈ నెల 16 నుంచి వైఎస్సార్‌టీపీ రిజిస్టర్డ్‌ పార్టీగా మనుగడలోకి వచ్చినట్టు తెలిపింది.

కాగా, రిజిస్టర్డ్‌ పార్టీ కావడంతో వైఎస్సార్‌టీపీకి శాశ్వత ఎన్నికల చిహ్నం కేటాయింపు ఉండదని, రాష్ట్ర శాసన సభ లేదా లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో 5శాతానికి పైగా సీట్లలో తమ అభ్యర్థులను పార్టీ నిలబెడితే అందరికీ ఒకే ఎన్నికల గుర్తు కేటాయిస్తామని తెలి పింది. ఏ పార్టీకి కేటాయించకుండా ఉండే ఎన్నికల గుర్తుల విషయంలో స్వతంత్ర అభ్యర్థులతో పోలిస్తే రిజిస్టర్డ్‌ పార్టీకి ప్రాధాన్యతనిస్తామని వెల్లడించింది. రిజిస్టర్డ్‌ పార్టీగా అవతరించడంతో వైఎస్సార్‌టీపీ లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించింది.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి తనయ వై.ఎస్‌. షర్మిల స్థాపించిన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు నివ్వడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సహాన్ని నింపింది. బుధవారం ఈసీ నుంచి లేఖ అందుకున్న నేపథ్యంలో లోటస్‌పాండ్‌లోని కార్యాలయంలో పార్టీ అధినేత్రి షర్మిల తన తల్లి విజయమ్మ, భర్త అనిల్‌తో కలసి కేక్‌ కట్‌ చేశారు.  కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర త్వరలో ప్రారంభమవుతుందని సీనియర్‌ నాయకుడు తూడి దేవేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement