కూతురు ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య | Daughters love marriage father passed away | Sakshi
Sakshi News home page

కూతురు ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య

Apr 13 2025 1:01 AM | Updated on Apr 13 2025 1:01 AM

Daughters love marriage father passed away

అయినా తాను తిరిగి రానని చెప్పిన కూతురు

నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో ఘటన

చిట్యాల: కూతురు ఇంటి నుంచి వెళ్లిపో యి ప్రేమ వివాహం చేసుకోవటంతో మనస్తాపానికి గురైన తండ్రి గడ్డి నిర్మూలన మందు తాగి ఆత్మహ త్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా చిట్యాలలో ఈ ఘటన జరిగింది. చిట్యాలకు చెందిన రెముడాల గట్టయ్య (46) కూతురు (18) మార్చి 8వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో గట్టయ్య ఫి ర్యాదుతో చిట్యాల పోలీసులు మిస్సింగ్‌ కేసు నమో దుచేశారు. 

అయితే, ఇంటినుంచి వెళ్లిపోయిన 3 రోజుల తర్వాత ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన గట్టయ్య కూతురు.. తాను ఊదరి యాదగిరి అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నానని, తన కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరింది. ఈ విషయాన్ని పోలీసులు గట్టయ్యకు చెప్పారు. దీంతో తన కూతురితో ఒక్కసారి మాట్లాడించాలని గట్టయ్య చిట్యాల పోలీసులను వేడుకున్నాడు. 

అందుకు పోలీసులు నిస్సహాయత వ్యక్తంచేయటంతో నెల రోజుల నుంచి గట్టయ్య పలువురు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి మొరపెట్టుకున్నాడు. అయినా తనకు న్యాయం జరగటం లేదన్న మనోవేదనతో శుక్రవారం మధ్యాహ్నం చిట్యాల పట్టణ శివారులోని తన వ్యవసాయ భూమి వద్ద గడ్డి నివారణ మందు తాగాడు. గట్టయ్యను కుటుంబ సభ్యులు హైదరాబా ద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. 

గట్టయ్య మృతి విషయం తెలియగానే శనివారం ఉదయం చిట్యాల పోలీస్‌స్టేషన్‌ వద్దకు మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున చేరుకొని నిరసనకు దిగారు. దీంతో నార్కట్‌పల్లి సీఐ కె.నాగరాజు అక్కడికి చేరుకుని గట్టయ్య కూతురుతో ఫోన్‌లో మాట్లాడారు. తండ్రి మృతి విషయం తనకు తెలిసిందని, అయినా ముంబైలో ఉన్న తాను తిరిగి రానని కరాఖండిగా చెప్పింది. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు నిరసనను విరమించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement