‘అక్రమ మైనింగ్‌ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?’ | BRS Leader Harish Rao Raises Mining Issue in Assembly | Sakshi
Sakshi News home page

‘అక్రమ మైనింగ్‌ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?’

Mar 28 2026 3:08 PM | Updated on Mar 28 2026 3:51 PM

BRS Leader Harish Rao Raises Mining Issue in Assembly

హైదరాబాద్‌:  నగరం నడిబొడ్డను అక్రమ మైనింగ్‌ జరుగుతుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు ధ్వజమెత్తారు. కంచె చేనుమేసినట్లు.. రక్షకుడే భక్షకుడిలా మారినట్లు అక్రమ మైనింగ్‌ జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు(శనివారం, మార్చి 28వ తేదీ) అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మైనింగ్‌ అంశంపై హరీష్‌రావు మాట్లాడారు. 

‘రాఘవ కన్స్ట్రక్షన్స్ నడుపుతున్న క్రషర్స్ కు ఎలాంటి అనుమతులు లేవు. జీవో త్రిబుల్ వన్ వైలెట్ చేస్తూ ఆక్రమణ జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?, క్రషర్ నడపాలంటే 8 రకాల అనుమతులు కావాలి. నిబంధనలను పాటించకుండా క్రషర్ నడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల గండిపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?, మైనింగ్ శాఖ షోకాజ్ నోటీసులతోపాటు డిమాండ్ నోటీసులు ఇచ్చింది. 

రెండవసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేని క్రషర్ ను మూసివేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మైనింగ్ శాఖ లేఖ పంపినా చర్యలు లేవు.  నేను చెప్పింది తప్పు అయితే నన్ను ఊరి తీయండి. మా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ్ముడు క్లస్టర్ లో చిన్న తప్పు జరిగితే రాత్రికి రాత్రే జైల్లో పెట్టారు. 

మంత్రి పొంగులేటి రాజీనామ చేయాలి
‘తప్పులు చేశారు కాబట్టే ముఖ్య నెత సంస్థకు నోటీసులు ఇచ్చారు. ముఖ్య నేత క్లస్టర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అక్రమ మైనింగ్ కు నైతిక బాధ్యత వహిస్తూ  మంత్రిగా పొంగులేటి రాజీనామా చేయాలి’ అని డిమాండ్‌ చేశారు

హరీష్‌ వ్యాఖ్యలు ఖండించిన మంత్రి శ్రీధర్‌బాబు
అక్రమ మైనింగ్‌పై హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్‌బాబు ఖండించారు. హరీష్‌రావు డిమాండ్‌ చేసినట్లు విచారణ చేయిస్తామని, అంతే కానీ స్లీపింగ్‌ రిమార్క్స్‌ చేస్తాం అంటే ఊరుకోమన్నారు. పొంగులేటిపై హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. సభ రికార్డుల నుంచి హరీష్ రావు వ్యాఖ్యలను తొలగించాలని, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నారు.

ఇల్లీగల్ దందా.. హైదరాబాద్ నడిబొడ్డున ఉల్లంఘన..

Advertisement
 
Advertisement
Advertisement