బ్యాటరీ పేలి.. తెగిపడిన బాలుడి చేతి వేళ్లు | Battery explosion severes boy fingers in Medak district | Sakshi
Sakshi News home page

బ్యాటరీ పేలి.. తెగిపడిన బాలుడి చేతి వేళ్లు

May 4 2026 2:10 AM | Updated on May 4 2026 2:10 AM

Battery explosion severes boy fingers in Medak district

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివతేజ

మెదక్‌ జిల్లాలో ఘటన 

నర్సాపూర్‌ రూరల్‌: బ్యాటరీ పేలి బాలుడి చేతి వేళ్లు తెగిపడ్డాయి. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రాజీపేట సత్తయ్య చిన్న కుమారుడు శివతేజ 4వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో తోటి పిల్లలతో కలిసి గ్రామంలోని ఓ కిరాణ షాపులో బ్యాటరీ, ఒక చిన్న ఫ్యాన్‌ను కొనుగోలు చేసి.. ఆ బ్యాటరీతో ఫ్యాన్‌కు కనెక్షన్‌ ఇచ్చి సరదాగా ఆడుకుంటున్నాడు.

ఈ క్రమంలో ఒక్కసారిగా బ్యాటరీ పేలి, శివతేజ ఎడమ చేతి మూడు వేళ్లు తెగిపడ్డాయి. దీంతో బాధిత బాలుడితో పాటు తోటి పిల్లలు భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. వెంటనే బాలుడిని కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు వైద్యుని వద్ద ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ కొంపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుని వేళ్లకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు అతడి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement