బిర్యానీ ఇవ్వలేదని కరెంట్‌ కట్‌

Ameerpet: Electricity Employee Power Cut Hotel Not Give Biryani - Sakshi

అమీర్‌పేట: కరెంటు బిల్లులు చెల్లించినా బిర్యానీ ఇవ్వడం లేదన్న కోపంతో హోటల్‌కు కరెంటు సరఫరాను నిలిపివేశారని బల్కంపేటలో గల క్రిస్టల్‌ బావర్చి హోటల్‌ నిర్వా హకుడు ఆరోపించారు. హోటల్‌కు సంబంధించి మూడు కరెంటు మీటర్లు ఉన్నాయి. ఒక మీటరుకు రూ. 39,566, రెండో మీటర్‌కు రూ. 4,529, మూడో మీటర్‌కు రూ. 9,682ల కరెంటు బిల్లు వచ్చింది. పై రెండు మీటర్లకు సంబంధించి బిల్లులు 25న చెల్లించగా మూడో మీటర్‌ బిల్లును 29న చెల్లించామని హోటల్‌ నిర్వాహకుడు సైయ్యద్‌ హస్మతుల్లా ఖాద్రి తెలిపారు.

ఉదయం కరెంటు సిబ్బంది సుధీర్‌కుమార్, రాజు, జీఎన్‌ రావులు హోటల్‌కు వచ్చి బిల్లులు చెల్లించని కారణంగా కరెంటును కట్‌ చేస్తున్నామని తెలిపారు. ఫోన్‌ పే ద్వారా రెండు బిల్లులు చెల్లించామని, ఓ బిల్లు ఈ రోజే చెల్లించామని, ఫోన్‌లో చెల్లించినట్లు ఉన్న స్క్రీన్‌ షాట్‌ను కూడా చూపించారు. అయినా వారి మాటలు పట్టించుకోకుండా మూడు మీటర్లకు కరెంటును కట్‌ చేశారు. హోటల్‌ యజమాని వచ్చే వరకైనా ఆగాలని హోటల్‌ సిబ్బంది నవీద్‌ వేడుకోగా మీ సార్‌... వచ్చేదాక ఆగాలా అంటూ కరెంటు కట్‌ చేసి అక్కడి నుంచి వెళ్లి పోయారు. 

ఒక మీటర్‌కు ఆలస్యమైతే మూడు మీటర్లకూ కట్‌ చేస్తారా.. 
మూడో మీటర్‌ ఒక్క దానికి బిల్లు చెల్లింపు ఆలస్యం జరిగితే మూడు మీటర్లకు విద్యుత్‌ సరఫరా ఎలా నిలిపివేస్తారని యజమాని ఖాద్రి వాపోయాడు. ఉదయం నుంచి కరెంటు లేకపోవడంతో ఆహార పదార్థాలు అన్ని పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. 

( చదవండి: కరోనా బాధితులకు గుడ్‌ న్యూస్‌: ఫోన్‌ కొడితే.. ఇంటి వద్దకే.. )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top