‘కౌలు’కు ఏపీ తరహా చట్టం  | Agriculture Department suggestion to Dharani Committee | Sakshi
Sakshi News home page

‘కౌలు’కు ఏపీ తరహా చట్టం 

Jan 28 2024 3:36 AM | Updated on Jan 28 2024 3:36 AM

Agriculture Department suggestion to Dharani Committee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఏపీలో అమలు చేస్తున్న పంటసాగు హక్కుల చట్టం–2019 తరహాలోనే తెలంగాణలో సైతం కొత్త చట్టం తీసుకొస్తే  కౌలు రైతులకు ‘రైతు భరోసా’ పథకం వర్తింపజేయడానికి అవకాశం ఉంటుందని, ధరణి పోర్టల్‌ పునర్ని ర్మాణ కమిటీకి వ్యవసాయశాఖ ప్రతిపాదించింది. వ్యవసాయం, గిరిజన సంక్షేమం, అటవీశాఖల అధికారులతో శనివారం రాష్ట్ర సచివాలయంలో కమిటీ సమావేశమై చర్చించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కౌలుదారులకు రైతు భరోసా ఇచ్చేందుకు అనుసరించాల్సిన  విధానంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ప్రతి ఏటా నిర్దేశిత కటాఫ్‌తేదీ నాటికి ధరణి పోర్టల్‌లో ఉన్న భూరికార్డుల సమాచారం ఆధారంగా రైతుబంధు పంపిణీ చేస్తున్నామని వ్యవసాయశాఖ అధికారులు కమిటీకి నివేదించారు. రైతుబంధు సాయం పొందుతున్న లబ్ధిదారులు నిజంగా భూములను అనుభవిస్తున్నారా? పంటలు సాగు చేస్తున్నారా? ఖాళీ భూములకు కూడా రైతుబంధు చెల్లిస్తు న్నారా? అని కమిటీ ప్రశ్నించగా, తమ వద్ద ఎలాంటి సమాచా రం లేదని వ్యవసాయశాఖ అధికారులు బదులిచ్చారు. అటవీ భూములన్నింటిని ధరణిలోని నిషేధిత భూముల జాబితాలో చేర్చలేదని, అటవీశాఖ అధీనంలోని భూముల లెక్కకు, ధరణి లోని అటవీ భూముల లెక్కకు పొంతన లేదని అటవీఅధికారులు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు.

అటవీ భూముల పరిరక్షణకు ధరణిలో లోటుపాట్లు సరిచేయాలని కోరారు. గిరిజన ప్రాంతా ల్లోని కొందరు రైతుల పట్టాభూముల వివరాలు పాత రికార్డుల్లో నమోదు కాకపోవడంతో, ధరణిలో ఎంట్రీకి నోచుకోలేదని గిరి జనశాఖ అధికారులు కమిటీకి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వారసత్వ బదిలీకి గ్రామసభలు నిర్వహించి తీర్మానం చేయాలని నిబంధనలు ఉండటంతో ఇబ్బందికరంగా మారిందని వివరించారు. క్షేత్ర స్థాయిలో గిరిజన రైతుల ఆధీనంలో ఉన్న భూము లను వారి పేరు మీద ధరణిలో ఎంట్రీ చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ నేత కోదండరెడ్డి, భూచట్టాల నిపుణుడు సునీల్‌కుమార్, రిటైర్డ్‌ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రేమండ్‌ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ మధుసూదన్, సీఎంఆర్‌ఓపీడీ వి.లచ్చిరెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కమిటీ తదుపరిగా వచ్చేనెల 3వ తేదీన సచివాలయంలో  స్టాంపులు, రిజి స్ట్రేషన్లు, వక్ఫ్, ఎండోమెంట్, స్వే అండ్‌ సెటిల్మెంట్‌ శాఖల అధికారులతో సమావేశమై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించనుంది. జిల్లాల పర్యటనల తర్వాత తుది నివేదిక ఇవ్వనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement