రామేశ్వరంలో గ్రాండ్‌ కాంటినెంట్‌ సేవలు | - | Sakshi
Sakshi News home page

రామేశ్వరంలో గ్రాండ్‌ కాంటినెంట్‌ సేవలు

Apr 13 2026 8:02 AM | Updated on Apr 13 2026 8:02 AM

సాక్షి, చైన్నె : పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైన రామేశ్వరంలో తమ సేవలకు శ్రీకారం చుట్టామని గ్రాండ్‌ కాంటినెంట్‌ హోటల్స్‌ వ్యవస్థాపకులు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేష్‌ శివ ప్రకటించారు. పాంబన్‌ దీవులలో అత్యాధునిక సౌకర్యాలతో ప్రారంభమైన ఈ ఫోర్‌–స్టార్‌ వెజిటేరియన్‌ హోటల్‌, దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక , పర్యాటక రంగాల్లో తన ఉనికిని చాటుకోవాలనే లక్ష్యంతో ఉన్నట్టు వివరించారు. ఏడాది పొడవునా భక్తులు, పర్యాటకులు వచ్చే తీర్థయాత్ర స్థలాలపై తాము దృష్టి పెట్టామన్నారు. రామేశ్వరం వచ్చే దేశీయ పర్యాటకులు, కుటుంబాలు, ఆధ్యాత్మిక వేత్తలకు సౌకర్యవంతమైన, పరిశుభ్రమైన , ప్రధాన ఆలయాలకు దగ్గరగా ఉండే బసను అందించడమే ఈ హోటల్‌ లక్ష్యంగా వివరించారు. ఇది 31వ హోటల్‌గా పేర్కొంటూ, దక్షిణ భారతదేశం బలమైన వృద్ధితో ముందుకెళ్తున్నామన్నారు. రామేశ్వరం వంటి ప్రాంతాల్లో నాణ్యమైన వసతికి నిరంతరం డిమాండ్‌ ఉంటోందని పేర్కొంటూ, భవిష్యత్తులో సోమనాథ్‌, వారణాసి , అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలలో కూడా తమ హోటళ్లను ప్రారంభించబోతున్నామని ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement